ఫిట్ నెస్ రిపోర్ట్ వచ్చాకే అభినందన్ పై నిర్ణయం: ధనోవా

ఫిట్ నెస్ రిపోర్ట్ వచ్చాకే అభినందన్ పై నిర్ణయం: ధనోవా

వింగ్ కమాండర్ అభినందన్ ఎప్పుడు మళ్లీ ఎయిర్ ఫోర్స్ చేరుతారన్న అంశంపై స్పందించారు ఎయిర్ ఫోర్స్ చీఫ్ బీరేందర్ సింగ్  ధనోవా. కోయంబత్తూరులో మీడియాతో మాట్లాడిన ధనోవా… అభినందన్ మళ్లీ పైలట్ గా ఎయిర్ ఫోర్స్ లోకి వచ్చే విషయం.. అతడి మెడికల్ ఫిట్ నెస్ పై ఆధారపడి ఉందని చెప్పారు. అభినందన్ కు వైద్య పరీక్షలు జరిగాయని… వాటికి ట్రీట్ మెంట్ అవసరమైతే  అందిస్తామన్నారు. మెడికల్ ఫిట్ నెస్ మా చేతికొచ్చిన తర్వాత… దాని ఆధారంగా ఫైటర్ కాక్ పిట్ లోకి అభినందన్ వెళ్లగల్గుతాడని చెప్పారు బీఎస్ ధనోవా.