ఢిల్లీలో ఉంటున్నారా... మీ ఆయుర్దాయం 12 ఏళ్లు తగ్గినట్టే...

ఢిల్లీలో  ఉంటున్నారా... మీ ఆయుర్దాయం 12 ఏళ్లు  తగ్గినట్టే...

దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకు కాలుష్యం పెరిగిపోతుంది.  రానున్న కాలంలో ఢిల్లీ వాసులపై కాలుష్య ప్రభావం తీవ్రంగా ఉంటుందని చికాగో విశ్వవిద్యాలయంలోని ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ (AQLI) వెల్లడించింది. భారత దేశ రాజధాని ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ఉందని, కాలుష్య స్థాయి  ఇలాగే కొనసాగితే ఢిల్లీ ప్రజలు తమ 11.9 ఏళ్ల జీవిత కాలాన్ని కోల్పోయే అవకాశం ఉందని తేలింది.

భారతదేశంలోని 1.3 బిలియన్ల ప్రజలు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) నిర్ధేశించిన కాలుష్య పరిమితిని దాటిన ప్రాంతాల్లోని నివసిస్తున్నారని చికాగో విశ్వవిద్యాలయంలోని ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ (AQLI) తెలిపింది. దేశంలో 67.4 శాతం మంది ప్రజలు...  అధికంగా ఉన్న కాలుష్య   ప్రాంతాల్లోనే నివసిస్తున్నారని తెలిపింది.

ఫైన్ పార్టికల్ ఎయిర్ పొల్యూషన్(PM2.5) సగటున భారతీయుడి ఆయుర్దాయాన్ని 5.3 ఏళ్లు తగ్గిస్తుందని అధ్యయనం తేల్చింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంలో ఢిల్లీ ఉందని, నగరంలోని 18 మిలియన్ల నివాసితులు సగటున 11.9 ఏళ్ల ఆయుర్థాయాన్ని కోల్పోతున్నారని... జాతీయ సూచీలతో పోల్చితే 8.5 ఏళ్ల ఆయుర్దాయాన్ని కోల్పోవడానికి అవకాశం ఉందని AQLI తెలిపింది. కాలుష్య గణాంకాలను పరిశీలిస్తే తక్కువ కాలుష్యం ఉన్న జిల్లా పంజాబ్ లోని పఠాన్ కోట్ ఉంది. అయినప్పటికీ డబ్ల్యూహెచ్ఓ పరిమితిని మించి 7 రెట్లు అధిక కాలుష్యం ఉంది. దీని వల్ల 3.1 సంవత్సరాల ఆయుర్దాయం తగ్గుతుందని నివేదిక తెలిపింది.