Vitika sheru: అమ్మ ముందే కమిట్మెంట్.. షాకింగ్ కామెంట్స్ చేసిన వరుణ్ భార్య

Vitika sheru: అమ్మ ముందే కమిట్మెంట్.. షాకింగ్ కామెంట్స్ చేసిన వరుణ్ భార్య

నటి వితిక షేరు(Vitika sheru) అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ, హీరో వరుణ్ సందేశ్(Varun sandesh) భార్య అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు కేవలం కొన్ని సినిమాలు చేసి ఇండస్ట్రీకి దూరమైంది. అనంతరం హీరో వరుణ్ సందేశ్ ను పెళ్లిచేసుకొని సెటిల్ అయింది. ఆతరువాత తెలుగు బిగ్ బాస్ లో కపుల్ గా ఎంట్రీ ఇచ్చారు వరుణ్ అండ్ వితిక. ఆ షో ద్వారా మళ్ళీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది వితిక. 

ఇక అప్పటినుండి సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ వస్తున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా తన పర్సనల్ విషయాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు వితిక. అంతేకాదు.. హీరోయిన్ గా అవకాశాల కోసం చూస్తున్న సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి కూడా వివరించారు వితిక. ఇందులో భాగంగా వితిక మాట్లాడుతూ.. నేను నా 12 ఏళ్ళ వయసు నుండి ఇండస్ట్రీలో ఉన్నాను. కెరీర్ స్టార్టింగ్ లో ఒకసారి హీరోయిన్ అవకాశం కోసం ఒక సినిమా ఆఫీస్ కి వెళ్లాను.

అప్పుడు మా అమ్మ కూడా నాతో ఉన్నారు. ఆడిషన్స్ చేశాక మా అమ్మ ముందే నాతో కమిట్మెంట్ గురించి అడిగాడు. నేను వాళ్ళ మొహం మీదే నో చెప్పాను. ఇలాంటి కమిట్మెంట్స్ లేకుండా వచ్చిన సినిమాలే చేద్దాం అని ఫిక్స్ అయ్యాను. అందుకే తక్కువ సినిమాలు చేశానేమో అన్పిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది వితిక. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.