Pushpa 2 Second Song Update: ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. పుష్ప 2 నుండి సెకండ్ సాంగ్ వచ్చేస్తోంది!

Pushpa 2 Second Song Update: ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. పుష్ప 2 నుండి సెకండ్ సాంగ్ వచ్చేస్తోంది!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా వస్తున్న ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ పుష్ప 2(Pushpa 2). స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తోంది. పుష్ప పార్ట్ 1 భారీ విజయం సాధించిన నేపధ్యంలో పార్ట్ 2పై ప్రేక్షకుల్లో అంచనాలు నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇందులో భాగంగానే పుష్ప 2 మూవీ నుండి వినిపిస్తున్న న్యూస్ ఒకటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖుషీ చేస్తోంది. 

అదేంటంటే.. పుష్ప 2 నుండి ఇటీవలే మొదటి పాట విడుదలైన విషయం తెలిసిందే. పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్ అంటూ వచ్చిన ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేసింది. అతి తక్కువ సమయంలో ఎక్కువ వ్యూస్, లైక్స్ సాధించిన సాంగ్ గా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక ఈ పాటలో అల్లు అర్జున్ వేసిన హుక్ స్టెప్స్ కి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటకు సంబంధించిన రీల్స్ కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి మరో సాంగ్ విడుదల చేయాలని చూస్తున్నారట మేకర్స్. మొదటి సాంగ్ కి ఆడియన్స్ నుండి వచ్చిన రెస్పాన్స్ కి పుష్ప మేకర్స్ ఫుల్లు హ్యాపీ గా ఫీలవుతున్నారట. అందుకే అదే ఊపులో మరో సాంగ్ విడుదల చేసి ఆడియన్స్ కు సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు జూన్ లో పుష్ప 2 సెకండ్ సాంగ్ విడుదల అయ్యే అవకాశం ఉందట. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది.