
ప్రభాస్(Prabhas) 'కల్కి 2898 AD' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కావడంతో వరల్డ్ వైడ్ గా హిట్ టాక్ తెచ్చుకోంది. దీంతో ఈ మూవీ పై భారీ ఆశలు పెట్టుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అలాగే ఈ మూవీలో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన నటి నటులతో పాటు వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందిన టెక్నీషియన్స్ పనిచేస్తుండటంతో సినిమాపై ఆసక్తి అమాంతం పెరిగింది.
డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశా పటాని,దుల్కర్ సల్మాన్, కమల్ హాసన్, వంటి ప్రముఖులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అంతేకాకుండా ఇందులో రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించిన వీడియోని కల్కి మేకర్స్ పోస్ట్ చేశారు.
హీరో రానా ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.."డైరెక్టర్ నాగ్ అశ్విన్, నేను చిన్నప్పుడు ఒకటో తరగతి నుంచి ఫ్రెండ్స్. లీడర్ సినిమాకి శేఖర్ కమ్ముల వద్ద నాగ్ అశ్విన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసాడు. అలా మా మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. తరుచుగా కలుస్తూ.. సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడతాము.
అలాగే కల్కి సినిమా ఇండియా రూపు రేఖలు మారుస్తుంది.ఈ సినిమా గురించి ప్రపంచం మొత్తానికి తెలియాలని కామిక్ కాన్ ఈవెంట్ కి కూడా ప్రమోషన్స్ కూడా చేశాం.ఇండియాకి ఎవెంజర్స్ లాంటి సినిమా ఇది.నేను ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాను కాబట్టి నేను యాక్ట్ చేస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. కానీ నేను కల్కి సినిమాలో యాక్ట్ చెయ్యట్లేదు అని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
THE NEXT BIG MOMENT IS KALKI,
— Kalki 2898AD FC (@Kalki2898AD_FC) May 5, 2024
Nagi #Prabhas tho chese Cinema India, Indian Diaspora, One set of foreign kaadhu, Everybody in the World will get, I have an Avengers moment from #Kalki2898AD side That's what Excited me to be part of it! ?? — RD pic.twitter.com/DEM4Vqxlkn
మరి రానా యాక్ట్ చేయకపోతే ఇంకెవరెవరు ఈ సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ లు ఇస్తున్నారో తెలియాల్సి ఉంది. అయితే, ఈ సినిమా ఇప్పటికే పలు మార్లు వాయిదా పడి జూన్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.