Raju Yadav Trailer: తేజ సజ్జ చేతుల మీదుగా గెటప్ శ్రీను రాజు యాదవ్ ట్రైలర్ రిలీజ్

Raju Yadav Trailer: తేజ సజ్జ చేతుల మీదుగా గెటప్ శ్రీను రాజు యాదవ్ ట్రైలర్ రిలీజ్

 

‘జబర్దస్త్’ కమెడియన్ గెటప్ శ్రీను(Getup Srinu) ‘రాజు యాదవ్’(Raju Yadav) చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు. కృష్ణమాచారి దర్శకుడు. కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్స్ విడుదల కాగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. 

తాజాగా ఈ సినిమా ట్రైలర్ను యంగ్ హీరో తేజ సజ్జ(Teja Sajja) గెస్ట్గా వచ్చి రిలీజ్ చేశారు మేకర్స్.గెటప్ శ్రీను నవ్వులతో, ఎమోషన్ తో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. క్రికెట్ ఆడుతున్నప్పుడు మూతి మీద బాల్ తగిలి..లైఫ్ లాంగ్ నవ్వుతూ ఉండేలా హీరో ఫేస్ మారిపోతుంది. ఇక ఆపరేషన్ చేయిస్తే మాములుగా మారుతుంది కానీ డబ్బుల్లేక అలా వదిలేయడంతో ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు రాజు.

అతని నవ్వు వల్ల వచ్చిన సమస్యలు, ఆ నవ్వు వల్ల వచ్చే లవ్ స్టోరీతో..ఈ సినిమా తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. రాజు యాదవ్ సినిమాలో అంకితా ఖరత్ హీరోయిన్ గా నటించగా..హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. విరాట పర్వం ఫేమ్ సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం అందించాడు. ఈ మూవీ మే 17న రీలిజ్ కానుంది. 

అలాగే స్పెషల్గా చెప్పుకోవాలంటే..‘రాజు యాదవ్ నేడు..నీ రాస్తాలోకి వచ్చాడు,రాజు యాదవ్ వీడు..నిన్ను రాణిని చేసేస్తాడు..’ అంటూ చంద్రబోస్ రాసిన లిరిక్స్,రామ్ మిరియాల వాయిస్ పాటకు స్పెషల్ అట్రాక్షన్‌‌గా నిలిచాయి.