వన్డేల్లోకి మళ్లీ వస్తానంటున్న అజింక్యా..!

వన్డేల్లోకి మళ్లీ వస్తానంటున్న అజింక్యా..!

వరల్డ్‌కప్ లో 4వ నంబర్ నాదే అనుకున్నా
ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఏ స్థానంలో ఆడేందుకైనా రెడీ
టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానె

దుబాయ్‌: కెరీర్ స్టార్టింగ్ లో అన్ని ఫార్మాట్లు ఆడే సత్తా ఉన్న ప్లేయర్ గా పేరు తెచ్చుకున్న అజింక్యా రహనె ఇటీవల టెస్ట్ ల‌కే పరిమితమయ్యాడు. వైట్ బాల్ ఫార్మాట్స్ కు అతన్ని పక్కనపెట్టేశారు. గతేడాది వన్డే వరల్డ్ క‌ప్ కు సెలెక్ట్ చేయలేదు. లిమిటెడ్‌‌ ఓవరలో్ల పెద్దగా ఆకట్టుకోకపోవడంతో లాస్ట్ సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌‌కు కెప్టెన్‌ ‌గా ఉన్న రహానె ఈ సారి ఢిల్లీ క్యాపిటల్స్‌‌కు ట్రేడ్ ద్వారా బదిలీ అయ్యాడు. ఈ పరిస్థితిలో ఐపీఎల్‌‌13 రహానెకు కొత్త ఆరంభం కానుంది. పైగా, మెగా లీగ్‌‌లో సత్తా చాటి ఇండియా లిమిటెడ్‌ ఓవర్ల టీమ్‌‌లోకి తిరిగి వస్తానని రహానె కూడా అంటున్నాడు. లాస్ట్ ఇయర్ వన్డే వరల్డ్‌ కప్ జట్టులో నాలుగో నంబర్ తనదే అనుకున్నానని, కానీ, టోర్నీకి సెలెక్ట్ ‌చేయకపోవడంతో బాధపడ్డానని చెప్పాడు. ‘వరల్డ్‌ కప్ లో నాలుగో నంబర్ నాదే అనుకున్నా. కానీ, అది ముగిసిన అధ్యాయం. వన్డే టీమ్‌‌లోకి తిరిగి రావడమే ప్రస్తుం నా గోల్. వైట్ బాల్ ఫార్మాట్లో
అందరూ స్ట్రయిక్ రేట్‌‌‌, యావరేజ్‌ అని మాట్లాడుతారు గానీ వన్డే టీమ్‌‌ నుంచి నన్నుతప్పించే ముందు నా రికార్డు బా గానే ఉంది. సెలెక్ట‌ర్ల‌ ఆలోచన ఎలా ఉన్నా నా మీద నాకు నమ్మకం ఉంది. కచ్చితంగా కమ్‌‌బ్యాక్ ‌‌చేస్తా’ అని రహానె స్పష్టం చేశాడు.

రికీ సమక్షంలో ఆడేందుకు వెయిటింగ్

ఢిల్లీ క్యాపిటల్స్ ‌‌కోచ్ ‌‌రికీ పాంటింగ్ ‌‌ఆధ్వర్యంలో ఆడేందుకు ఎదురుచూస్తున్నానని రహానె తెలిపాడు . ‘పాంటింగ్‌‌ సమక్షంలో ఆడాలని చాలా ఉత్సాహంగా ఉన్నా. ఒక ఆటగాడిగా నేనెప్పుడూ మరింత ఎదగాలని, ఇంకా నేర్చుకోవాలని కోరుకుంటా . కరోనా కారణంగా రికీతోఎక్కువ సమయం గడిపే పరిస్థితి లేదు. కానీ అతని దగ్గర నుంచి వీలైనంత నేర్చుకుంటా’అని అజింక్యా వివరించాడు.

దానికి అశ్వినే ఆన్సర్ ఇవ్వాలి

మన్కడింగ్‌‌ విషయంలో రికీ పాంటింగ్‌‌, ఈ సారి ఢిల్లీకి ఆడుతున్న స్పిన్నర్ అశ్విన్‌ భిన్నాభిప్రాయాలపై స్పందించేందుకు రహానె నిరాకరించాడు. లాస్ట్‌ ఇయర్జోస్‌‌బట్లర్ను అశ్వి న్ (పంజాబ్ ‌) మన్కడింగ్ ‌‌చేసినప్పుడు రాయల్స్‌‌కు రహానె కెప్టెన్‌‌గా ఉన్నాడు. అయితే, ఈసారి మన్కడింగ్‌‌ను అనుమతించను అని పాంటింగ్ ‌‌స్పష్టం చేశాడు. దీనిపై మాట్లాడిన రహానె ‘ఈ విషయం గురించి ఇప్పుడు అశ్వినే మాట్లాడాలి. పాంటింగ్‌‌ ఇది వరకే సమాధానం చెప్పాడు కాబట్టి ఆ న్యూస్ ‌అక్కడితో పూర్తయింది. దాన్ని అలానే ఉంచాలి. ఇప్పుడు మేం ఒకే టీమ్‌‌కు ఆడుతున్నాం కాబట్టి ఒకరినొకరు సపోర్ట్ ‌చేసుకోవాలి’అని అన్నాడు.