బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం: తెలంగాణలో మూడు రోజులు వర్షాలు

బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం: తెలంగాణలో మూడు రోజులు వర్షాలు

తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని -IMD ప్రకటించింది. రాయలసీమ నుండి పశ్చిమ -మధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టం నుండి 3.1- 5.8 కి. మీ మధ్యలో ద్రోణి కొనసాగనుంది. ఆదివారం నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు, కొన్ని జిల్లాలలో మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది.

ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో ఉరుములు, మెరుపులు మరియు గంటకు 30-40 కి.మీతో ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో ఇప్పటికే అక్కడక్కడా వర్షాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో ఇదే వాతావరణ పరిస్థితి వరుసగా మూడు రోజులు కొనసాగనుందని వాతావరణ శాఖ తెలిపింది.