డాక్టర్లు టైమ్​కు రారు.. నర్సులు ఉండరు..

డాక్టర్లు టైమ్​కు రారు.. నర్సులు ఉండరు..

మెదక్ ​జిల్లా మనోహరాబాద్​మండలంలో కొత్తగా ఏర్పాటు చేసిన 24 గంటల పీహెచ్​సీలో డాక్టర్లు సమయపాలన పాటించడం లేదు. ఉదయం10 గంటల  తర్వాత వచ్చి ఇష్టమొచ్చిన సమయానికి వెళ్లిపోతున్నారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్ వికాస్ ది రెడ్డిపల్లి పోస్టింగ్ కాగా మనోహరాబాద్ పీహెచ్​సీకి ఇన్​చార్జి బాధ్యతలు అప్పగించారు.

అలాగే పీహెచ్​సీ లో స్టాఫ్ నర్స్ ఒక్కరే ఉండడంతో రాత్రిపూట ఏఎన్ఎంలు నైట్ డ్యూటీ చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్టాఫ్ నర్సులు, సిబ్బందిని కేటాయించి డాక్టర్లు నిత్యం అందుబాటులో ఉండేలా చూడాలని కోరుతున్నారు.   

మనోహరాబాద్, వెలుగు