ఎన్సీపీ శాసనసభా పక్షం భేటీ: అజిత్ పవార్ పదవి తొలగింపు

ఎన్సీపీ శాసనసభా పక్షం భేటీ: అజిత్ పవార్ పదవి తొలగింపు

మహారాష్ట్ర రాజకీయంలో అనూహ్యమైన ట్విస్ట్ ఇచ్చిన ఎన్సీపీ నేత అజిత్ పవార్‌పై ఆ పార్టీ చర్యలు తీసుకుంది. ఎన్సీపీ శాసనసభాపక్ష నేత పదవి నుంచి తొలగించింది. ఆయన స్థానంలో మరో నేతను ఎన్నుకుంది.

శివసేన – కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయిస్తే… దానికి భిన్నంగా ఇవాళ ఉదయం బీజేపీకి అండగా నిలిచారు అజిత్ పవార్. తనతో పాటు కొంత మంది ఎమ్మెల్యేలను రాజ్ భవన్‌కు తీసుకెళ్లి బీజేపీకి ఎన్సీపీ మద్దతు ఉందని చెప్పారు. మహారాష్ట్ర సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్‌లతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు.

దీంతో పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా వెళ్లినందుకు శాసనసభాపక్ష నేతగా ఉన్న అజిత్ పవార్‌ను ఆ పదవి నుంచి తొలగించింది ఎన్సీపీ. శనివారం రాత్రి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. అజిత్ పవార్ స్థానంలో ఆ పార్టీ సీనియర్ నేత జయంత్ పాటిల్‌ను  కొత్త శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు.

కాగా, ఎన్సీపీ శాసనసభాపక్ష భేటీలో దాదాపు 50 మంది వరకు ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరైనట్లు తెలుస్తోంది. ఉదయం అజిత్ పవార్‌తో రాజ్‌భవన్‌కు 9 మంది ఎమ్మెల్యేలు వెళ్లగా వారిలో నలుగురైదుగురు తిరిగి శరద్ పవార్ దగ్గరకు వచ్చేసినట్లు సమాచారం.

MORE NEWS: 

గేమ్ ఆఫ్ థ్రోన్స్‌కు మించిన డ్రామా, ట్విస్టులు

ప్రమాణ స్వీకారం సంగతి మాకు తెలియదు: ఎన్సీపీ ఎమ్మెల్యేలు

కాలిపై కాలేసుకుని కూర్చోవద్దు: అమెరికా డాక్టర్ సలహా