Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ రోజునే బంగారం ఎందుకు కొనాలంటే..

Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ రోజునే బంగారం ఎందుకు కొనాలంటే..

అక్షయ తృతీయ అనేది ప్రతి సంవత్సరం హిందూ మాసం వైశాఖ మూడవ రోజున జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఇది సాధారణంగా ఏప్రిల్ లేదా మేలో వస్తుంది. దీన్నే అక్తి లేదా అఖా తీజ్ అని కూడా పిలుస్తారు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే ఈ పండుగ రోజున ఏదైనా కొత్త ప్రయత్నాలు లేదా పెట్టుబడులు పెడితే విజయం, శ్రేయస్సు, అదృష్టాన్ని తెస్తాయని చాలా మంది నమ్ముతుంటారు. అంతే కాదు ఈ రోజున ఆహారం, బట్టలు, డబ్బును పేదలకు దానం చేస్తూండడం చూసే ఉంటాం. దాని కంటే ముఖ్యంగా ఈ పవిత్రమైన రోజున బంగారం లేదా విలువైన వస్తువులను కొనుగోలు చేయడం మంచిదని విశ్వసిస్తూంటారు.

పూజా సమయం..

ఈ ఏడాదిలో అక్షయ తృతీయ ఏప్రిల్ 22, శనివారం ఉదయం 7.49 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 23న ఉదయం 7.47 గంటలకు ముగుస్తుంది. పూజ సమయం ఉదయం 6:04 నుంచి మధ్యాహ్నం 12:25 వరకు చేయవచ్చు.

అక్షయ తృతీయ ప్రాముఖ్యత ఏమిటంటే, ఈ రోజున ప్రారంభించిన ఏ పనికైనా అంతిమంగా మంచి ఫలితం దక్కుతుందని ప్రజలం నమ్మకం. కంపెనీ వృద్ధి చెందాలన్నా,  పెట్టుబడులు పెట్టాలన్నా చాలా మంది ఈ రోజునే అనువైన సమయంగా భావిస్తూంటారు. ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేయడం వల్ల సంపద, విజయాన్ని సిద్ధిస్తుందని చాలా మంది నమ్ముతారు. 

పరశురాముని జన్మదినం అంటే సత్యయుగం తర్వాత వచ్చే త్రేతాయుగం ప్రారంభం అయ్యే రోజున అక్షయ త-ృతీయగా భావిస్తారు. సుదాముడు శ్రీకృష్ణుడికి అవల్‌ను సమర్పించిన రోజుతో పాటు వేదవ్యాసుడు మహాభారత ఇతిహాసాన్ని రాయడం ప్రారంభించిన రోజు కూడా ఈ పండుగతో సంబంధం ఉంటాయి. ఇవే కాదు ఇంకా చాలా కారణాల వల్ల అక్షయ తృతీయ ఈ రోజే జరుపుకుంటారు. అంతే కాదు పూరీ జగన్నాథుని వార్షిక రథయాత్ర సైతం ఈ రోజునే ప్రారంభమవుతుంది.

అక్షయ తృతీయ నాడు విష్ణు భక్తులు ఉపవాసం ఉంటారు. ఈ రోజున వారు అవసరమైన వారికి బియ్యం, ఉప్పు, నెయ్యి, కూరగాయలు, పండ్లు, బట్టలు దానం చేస్తారు. విష్ణుమూర్తికి ప్రతీకగా తులసి జలాన్ని ప్రతిచోటా చల్లుతారు. తూర్పు భారతదేశంలో ఈ రోజు పంట కాలం ప్రారంభాన్ని సూచిస్తుంది.  వ్యాపారులు రాబోయే ఆర్థిక సంవత్సరానికి కొత్త ఆడిట్ పుస్తకాన్ని ప్రారంభించే ముందు గణేశుడిని, లక్ష్మీ దేవతను పూజిస్తారు. చాలా మంది ప్రజలు ఈ రోజున బంగారు లేదా బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. జైనులు చెరకు రసంతో పూజలు చేస్తారు.

 అక్షయ తృతీయ ప్రాముఖ్యత...

అక్షయ తృతీయ హిందూమతం, జైనమతం వారు శుభప్రదమైన రోజుగా భావిస్తారు. ఇది అదృష్టం, విజయాన్ని తెస్తుందని నమ్ముతారు. "అక్షయ" అనే పదానికి "శాశ్వతమైన" లేదా "ఎప్పటికీ తగ్గనిది" అని అర్ధం. కొత్త వెంచర్లు,  పెట్టుబడులను ప్రారంభించడానికి ఈ రోజు ప్రత్యేకంగా శుభప్రదమైనదని నమ్ముతారు. 

అక్షయ తృతీయ నాడు బంగారాన్ని ఎందుకు కొనుగోలు చేస్తారు?

అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొనుగోలు చేయడం వల్ల శ్రేయస్సు, అదృష్టం లభిస్తుందని నమ్ముతారు. హిందూ పురాణాల ప్రకారం, సంపద, శ్రేయస్సులనందించే  లక్ష్మీ దేవి పుట్టినరోజు ఈరోజు. అందుకే ఈ రోజున బంగారం కొని లక్ష్మీదేవిని సంతోషపెట్టడానికి, ఆమె ఆశీర్వాదాలను పొందడానికి ఇదొక మార్గంగా చెబుతారు. అదనంగా బంగారం అనేక సంస్కృతులలో సంపద హోదాకు చిహ్నంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేయడం వల్ల ఆర్థిక స్థిరత్వం, విజయం ప్రాప్తిస్తుందని చాలా మంది నమ్ముతుంటారు.