అలియా భట్ గంగూబాయి కతియావాడి తెలుగు టీజర్‌ రిలీజ్

అలియా భట్ గంగూబాయి కతియావాడి తెలుగు టీజర్‌ రిలీజ్

బాలీవుడ్ నటి అలియా భట్ కీ రోల్ లో నటించిన గంగూబాయి కతియావాడి టీజర్‌ మొదలైంది.ముంబైలోని రెడ్ లైట్ ఏరియాలోని కామాటిపురాలో కొన్ని దశాబ్దాల క్రితం హల్ చల్ చేసిన గంగూభాయ్ కతేవాలి నిజజీవిత కథ ఇది. కామాటిపురాలో వేశ్యాగృహం యజమాని అయిన గంగూభాయ్ అప్పట్లో ఆ ప్రాంతంలో చక్రం తిప్పింది. కామాటిపురలో అమావాస్య రాత్రి కూడా అంధకారం ఉండదంటారు. ఎందుకంటే అక్కడ గంగూ ఉంటుంది..అనే పవర్‌ఫుల్‌ డైలాగ్‌తో గంగూబాయి కతియావాడి టీజర్‌ మొదలైంది.

గుజరాత్ లోని కతియావాడ్ లో 1940 ప్రాంతంలో జన్మించిన గంగూభాయ్.. తన తండ్రి  దగ్గర పనిచేసే రామ్నిక్ లాల్ ని ప్రేమించి, ఇంట్లో చెప్పకుండా అతనితో కలసి ముంబైకి వచ్చేసింది. అయితే, రామ్నిక్ ఆమెను ఓ వేశ్యాగృహంలో అమ్మేసి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఆమె వేశ్యగా బతికి.. తన శక్తియుక్తులతో ముంబై మాఫియా డాన్లతో సన్నిహిత సంబంధాలు కొనసాగించి.. అనూహ్యంగా ఎదిగిపోయింది. 1960లలో కామాటిపురాను ఏలేసింది. మాఫియా డాన్లను, రాజకీయ నేతలను, పోలీస్ ఆఫీసర్లను తన చుట్టూ తిప్పుకుంది. 

ఈ స్టోరీనే ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్నాడు. గంగూభాయ్ గా అలియా భట్ ఇందులో చక్కని అభినయాన్ని ప్రదర్శించిందని అంటున్నారు. ఇటీవల ఈ హిందీ చిత్రం టీజర్ రిలీజ్ కాగా..లేటెస్టుగా తెలుగు డబ్బింగ్ టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాను తెలుగులో కూడా జులై 30న రిలీజ్ చేయనున్నారు.