టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నారు. గత కొంతకాలంగా ఈ హీరో పెళ్లిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తుండగా, వాటన్నింటికీ తెరదించుతూ పెళ్లి తేదీలు, వేదిక ఖరారయ్యాయి. తనదైన స్టైల్‌లో మాస్ సినిమాలతో మెప్పించే ఈ ‘అల్లుడు శీను’, ఇప్పుడు తన జీవితంలోకి అసలైన మహాలక్ష్మిని ఆహ్వానించేందుకు సిద్ధమయ్యారు.
తిరుమలలో పెళ్లి!
నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ వివాహం కావ్య రెడ్డి అనే యువతితో నిశ్చయమైంది. వీరిద్దరి నిశ్చితార్థ వేడుక ఏప్రిల్ 5న హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లో అత్యంత వైభవంగా, సినీ ప్రముఖుల సమక్షంలో జరగనుంది. ఇక అసలైన వేడుక, అంటే వివాహం ఏప్రిల్ 29న పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి సన్నిధిలో జరగబోతోంది. ఆధ్యాత్మిక వాతావరణంలో, అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఈ జంట ఒక్కటి కానుంది. అనంతరం మే 1న హైదరాబాద్‌లో సినీ రాజకీయ ప్రముఖుల కోసం భారీ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
ఎవరీ కావ్య రెడ్డి?
గత నెలలోనే సాయి శ్రీనివాస్ తన కాబోయే భార్యను సోషల్ మీడియా వేదికగా పరిచయం చేశారు. కావ్య రెడ్డిది హైదరాబాద్‌లోని ఒక గౌరవప్రదమైన న్యాయవాదుల కుటుంబం. ఆమె తండ్రి ప్రముఖ అడ్వకేట్ కాగా, తాతగారు జడ్జిగా పనిచేశారు. సినిమా రంగానికి ఎటువంటి సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, సాయి శ్రీనివాస్‌తో ఆమెకు ఉన్న అనుబంధం పెద్దల అంగీకారంతో పెళ్లి పీటల వరకు చేరింది.
►ALSO READ | 'TN 2026' టీజర్ సెన్సేషన్.. విజయ్ రాజకీయ ఎంట్రీకి ఈ సినిమానే రూట్ మ్యాపా?
ఎమోషనల్ పోస్ట్
కాబోయే సతీమణికి అభిమానులకు పరిచయం చేస్తూ సాయి శ్రీనివాస్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు అభిమానుల మనసు గెలుచుకుంది. "నా జీవితంలోకి వచ్చినందుకు, సరైన సమయంలో నాపై విశ్వాసం ఉంచినందుకు థాంక్స్. నీ మోముపై చిరునవ్వును ఎప్పటికీ వాడిపోనీయను. మన కొత్త ప్రయాణం కోసం ఎదురుచూస్తున్నాను" అంటూ తన ప్రేమను వ్యక్తం చేశారు. గతంలో వీరిద్దరి వేడుకకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.
ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'టైసన్ నాయుడు' వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. షూటింగ్స్ నుంచి చిన్న బ్రేక్ తీసుకుని తన వైవాహిక జీవితాన్ని ప్రారంభించబోతున్న ఈ యువ హీరోకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
To my Kavyaamma,
— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) March 9, 2026
Life has its own beautiful timing.. and mine bought you into my world. ❤️
Thank you for coming into my life, believing in me at right time, filling my days with positivity and countless smiles !! Will make sure that every smile on your face will never fade… pic.twitter.com/Vv9O1nxGyU
