ప్రీడయాబెటీస్‌తో ఇబ్బందా..? అయితే బాదం తినండి

ప్రీడయాబెటీస్‌తో ఇబ్బందా..? అయితే బాదం తినండి
  • బ్లడ్ గ్లూకోజ్ స్థాయి మెరుగుపడుతుంది.. కొలెస్ట్రాల్ స్థాయి కూడా వృద్ధి చెందుతుంది
  • తాజా అధ్యయనంలో వెల్లడి

మాయదారి మధుమేహ రోగం చుట్టుముట్టాక అందమైన లోకం నుంచి కష్టాల ప్రపంచంలోకి ప్రవేశించినట్లు ఫీలయ్యేవారికి శుభవార్త. బాదం పలుకులు తినడం వల్ల యువతలో బ్లడ్‌ గ్లూకోజ్‌ స్థాయి మెరుగుపడటంతో పాటుగా కొలెస్ట్రాల్‌ స్థాయి సైతం వృద్ధి చెందుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 
డయాబెటిస్.. మధుమేహం గత 40 ఏళ్లుగా మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 4 రెట్లు పెరుగుతున్న నేపధ్యంలో  ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనాలు జరుగుతున్నాయి. రోజు రోజుకీ పెరుగుతున్న మధుమేహ కేసుల సంఖ్య భారతదేశంలో మరింత ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. నిజానికి, భారతీయులలో ప్రీ డయాబెటీస్‌ నుంచి  టైప్‌ 2 మధుమేహంగా వృద్ధి చెందడం ఎక్కువగా ఉన్న నేపధ్యంలో అధ్యయనాలను మరింత తీవ్రం చేస్తున్నారు పరిశోధకులు. 
తాజా అధ్యయనం ప్రకారం బాదములను తినడం వల్ల హెచ్‌బీఏ1సీ వృద్ధి చెందడంతో పాటుగా బ్లడ్‌ లిపిడ్స్‌ సైతం యువత మరియు ప్రీ డయాబెటీస్‌తో బాధపడుతున్న కౌమారదశ  బాలల్లో  వృద్ధి చెందుతుందని అధ్యయనకారులు వెల్లడించారు. జీవనశైలిని మార్పు చేసుకోవడం ద్వారా ఈ ధోరణిని అడ్డుకోవచ్చని తేల్చారు. మెరుగైన పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు నిత్యం నడక, వ్యాయామాలు సహా జీవనశైలి మార్పులు ప్రీ డయాబెటీస్‌ నుంచి టైప్‌ 2 డయాబెటస్‌గా మారడం నియంత్రించడంలో సహాయపడతాయని నిర్ధారణ అయింది.