పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

పసిడి ప్రియులకు షాక్..  భారీగా పెరిగిన బంగారం ధరలు

పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్..  గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. మే 6వ తేదీ సోమవారం  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 200 పెరిగింది. ఇక,   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 220 పెరిగింది.  దీంతో  దేశంలోని ప్రధాన నగరాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 66,050 ఉండగా..  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.72,050గా ఉంది. 

ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,200గా ఉంది.  ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.72,200గా ఉంది.  
దేశ ఆర్థిక రాజధాని ముంబైతోపాటు బెంగళూరు, కోల్ కతా నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,050గా ఉంది.  ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.72,050గా ఉంది. 

బంగారం ధరలతో పాటుగా వెండి ధరలు కూడా తగ్గాయి.  ఈ రోజు  రూ. 1000 పెరిగింది. దీంతో  హైదరాబాద్,  చెన్నైలలో కేజీ వెండి రూ. 87,500 ఉండగా...బెంగళూరులో రూ.82,500.. ఢిల్లీ, ముంబై, కోల్ కత్తాలో రూ. 84,00గా ఉంది.