జీజీజీలో రిలయన్స్‌‌కు మెజారిటీ వాటా..ఆస్ట్రేలియా మార్కెట్‌‌లోకి ఎంట్రీ

జీజీజీలో రిలయన్స్‌‌కు మెజారిటీ వాటా..ఆస్ట్రేలియా మార్కెట్‌‌లోకి ఎంట్రీ

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌కి చెందిన ఎఫ్‌‌ఎంసీజీ విభాగం రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్‌‌ లిమిటెడ్  (ఆర్‌‌‌‌సీపీఎల్‌‌), హెల్త్ డ్రింక్స్ అమ్మే ఆస్ట్రేలియన్ కంపెనీ  గుడ్‌‌నెస్ గ్రూప్ గ్లోబల్ పీటీవై లిమిటెడ్‌‌ (జీజీజీ)లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. దీంతో ఆస్ట్రేలియా కన్స్యూమర్ గూడ్స్ మార్కెట్లోకి  అడుగుపెట్టింది.  

జీజీజీకి చెందిన నెక్స్‌‌బా, పేస్‌‌ , బైసన్‌‌,  గుడ్ బ్రేకీ వంటి బ్రాండ్లు ఆర్‌‌‌‌సీపీఎల్‌‌ పోర్ట్‌‌ఫోలియోలో చేరగా,  వీటిని భారత్‌‌తో పాటు కొత్త మార్కెట్లలోకి తీసుకువెళ్లే అవకాశం ఉందని   ఈ కంపెనీ  డైరెక్టర్ టి.కృష్ణకుమార్ తెలిపారు. జీజీజీ వ్యవస్థాపకుడు ట్రోయ్ డగ్లస్ మాట్లాడుతూ, ఆర్‌‌‌‌సీపీఎల్‌‌కి ఉన్న బలమైన సప్లయ్‌‌ చెయిన్, పంపిణీ నెట్‌‌వర్క్‌‌తో  తమ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి వీలుంటుందని అన్నారు.   ఆర్‌‌‌‌సీపీఎల్‌‌ ఇప్పటికే  రస్‌‌కిక్‌‌, సన్‌‌ క్రష్‌‌, శూన్య, జీరో- షుగర్ కార్బొనేటెడ్ డ్రింక్స్ ను అమ్ముతోంది.