హైదరాబాద్, వెలుగు: మనదేశంలోనే మొదటి క్వాంటం టెక్నాలజీ హబ్ ‘అమరావతి క్వాంటం వ్యాలీ’ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి 50 నుంచి పైగా సంస్థల భాగస్వామ్యంతో దీనిని నిర్మిస్తున్నారు. క్వాంటం కంప్యూటింగ్, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి కోసం ఈ క్యాంపస్ పనిచేస్తుంది. ఇందులో అత్యాధునిక ఐబీఎం క్వాంటం సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. టీసీఎస్ క్లౌడ్ ద్వారా క్వాంటం సేవలను పరిశోధకులకు అందుబాటులోకి తెస్తారు. 2030 నాటికి లక్ష మందికి పైగా ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నారు.
