ఎస్‌‌బీఐకి ఎన్నడూ లేనంత లాభం.. క్యూ3లో రూ.21,028 కోట్లు

ఎస్‌‌బీఐకి ఎన్నడూ లేనంత లాభం.. క్యూ3లో రూ.21,028 కోట్లు
  • వడ్డీ ఆదాయం రూ.45,190 కోట్లు

న్యూఢిల్లీ: c బ్యాంక్ నికర లాభం (స్టాండ్‌‌ఎలోన్‌‌) రూ.21,028 కోట్లకు చేరింది. 2024 డిసెంబర్ క్వార్టర్‌‌‌‌లో  వచ్చిన  రూ.16,891 కోట్లతో పోలిస్తే ఇది 24.5శాతం ఎక్కువ. ఆపరేటింగ్ లాభం (ఇబిటా)  కూడా 39.5శాతం పెరిగి రూ.32,862 కోట్లకు చేరింది. ఎస్‌‌బీఐ వడ్డీ ఆదాయం 2024 డిసెంబర్ క్వార్టర్‌‌‌‌లో రూ.41,446 కోట్లు ఉండగా  తాజా క్యూ3లో 9.04 శాతం పెరిగి  రూ.45,190 కోట్లకు ఎగిసింది.  నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ (ఎన్‌‌ఐఎం) 3.12శాతంగా నమోదైంది. 

డిపాజిట్లు+ లోన్లు  రూ.103 లక్షల కోట్లు..

 బ్యాంక్ మొత్తం వ్యాపారం  (డిపాజిట్లు, లోన్లు కలిపి) క్యూ3లో   రూ.103 లక్షల కోట్లను దాటింది. డిపాజిట్లు రూ.57 లక్షల కోట్లకు, అడ్వాన్సులు (ఇచ్చిన లోన్లు) రూ.46 లక్షల కోట్లకు చేరాయి.  క్యూ3లో డొమెస్టిక్‌‌గా ఇచ్చిన లోన్లు 15.14 శాతం వృద్ధి చెందాయి. రిటైల్ లోన్లు 16.5శాతం పెరగగా,  ఎస్‌‌ఎంఈ లోన్లలో 21శాతం,  వ్యవసాయ రుణాల్లో 16.5శాతం వృద్ధి కనిపించింది.  కార్పొరేట్ రుణాలు 13.4శాతం పెరిగాయి.

ఎస్‌‌బీఐ కాసా (కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్‌‌) డిపాజిట్లు 8.9శాతం పెరగగా, బ్యాంక్ మొత్తం డిపాజిట్లలో దీని వాటా 39.1శాతానికి చేరింది. ఎస్‌‌బీఐ అసెట్ క్వాలిటీ క్యూ3లో మెరుగుపడింది.  గ్రాస్ నాన్‌‌ పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్‌‌పీఏల) రేషియో  1.57శాతానికి తగ్గగా,  నెట్ ఎన్‌‌పీఏ రేషియో 0.39శాతానికి  దిగొచ్చింది. బ్యాంక్‌‌  డిజిటల్ ఛానెల్స్ ద్వారా సేవలందించడం పెంచింది.

క్యూ3లో ఓపెన్ అయిన బ్యాంక్ సేవింగ్స్‌‌ అకౌంట్లలో  68శాతం యోనో యాప్​ ద్వారా, మొత్తం ట్రాన్సాక్షన్లలో 98.6 శాతం ఆల్టర్నేటివ్ చానెల్స్ ద్వారా (బ్రాంచుల ద్వారా కాకుండా)  జరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో  ఫైనాన్షియల్ సెక్టార్‌‌‌‌లో అప్పులివ్వడం (క్రెడిట్ గ్రోత్‌‌) 13–15శాతం  పెరుగుతుందని అంచనా వేసింది. ఇది ముందుగా  వేసిన 12–14శాతం అంచనా కంటే ఎక్కువ. అంటే, రిటైల్, ఎస్‌‌ఎంఈ, కార్పొరేట్ రంగాల్లో డిమాండ్ బలంగా కొనసాగుతుందని బ్యాంక్ నమ్ముతోంది.