ఇన్ప్లుయెన్సర్ని ఆట ఆడుకుంటున్న నెటిజన్లు : స్వీట్ బాక్సులు అడిగితే.. టీవీ, ఫ్రిడ్జ్లు, యుద్ధ ట్యాంకర్ ఆర్డర్ చేశారు..!

ఇన్ప్లుయెన్సర్ని ఆట ఆడుకుంటున్న నెటిజన్లు : స్వీట్ బాక్సులు అడిగితే.. టీవీ, ఫ్రిడ్జ్లు, యుద్ధ ట్యాంకర్ ఆర్డర్ చేశారు..!

దేనికైనా ఓ హద్దు ఉంటుంది.. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే ఇది మరీనూ.. ఏ మాత్రం తేడా వచ్చినా దబిడి దిబిడే.. ఏదో బాగా చెబుతున్నాడు కదా అని అందరూ లైక్ చేస్తారు.. షేర్ చేస్తారు.. ఫాలో అవుతారు.. అంత మాత్రానికే ఇన్ ప్లుయెన్సర్ల ముసుగులో ఏది చెప్పినా చెల్లుతుంది.. ఏం అడిగినా ఫాలోవర్స్ ఏమీ అనుకోరు అనుకుంటే మాత్రం పొరపాటే. తమిళనాడు రాష్ట్రం మధురైకి చెందిన సోషల్ మీడియా ఇన్ ప్లుయెన్సర్ వీరమణి వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. 

దీపావళి వస్తుంది కదా.. స్వీట్ బాక్సులు పంపించండి బ్రో అంటూ తన ఫాలోవర్స్ ను కోరాడు వీరమణి.. ఫాలోవర్స్ బాగా స్పందించారు.. అలా ఇలా కాదు.. బీభత్సంగా స్పందించారు. కట్ చేస్తే నెటిజన్ల కాళ్లు పట్టుకుంటున్నాడు ఇప్పుడు వీరమణి.. చేతులు జోడించి ఫాలోవర్స్ ను వేడుకుంటున్నాడు ఆర్డర్స్ ఇవ్వొద్దు అని.. ఈ మొత్తం వ్యవహారంపై వెనక జరిగిన తతంగం ఏంటో తెలుసుకుందామా...

ఇన్  ఫ్లూయెన్సర్ వీరమణి.. తనకు సూపర్ స్టార్ రేంజ్ ఫాలోయింగ్ ఉందని అనుకున్నాడు. తను ఏం చెప్పినా వింటారు..  ఏం అడిగినా చేస్తారు ఫ్యాన్స్ అనుకున్నాడు కాబోలు. పండగకు స్వీట్లు పంపించండి అంటూ ఇన్ స్టాలో పోస్టులు పెట్టాడు. ఈయనకు ఇలా కాదు.. ఒక మాస్ రేంజ్ గిఫ్టులు అవసరం అనుకున్నట్లుంది ఫ్యాన్స్. వెంటనే నెంబర్, అడ్రస్ తీసుకుని ఆర్డర్స్ మీద ఆర్డర్స్ చేసి డెలివరీ పంపారు. 

ఫ్యాన్స్ నుంచి వచ్చిన గిఫ్ట్స్ మెసేజెస్ చూసి మురిసిపోయాడు వీరమణి. కానీ ఆ ఆనందం ఎక్కువ సేపు ఉండలేదు . డెలివరీ బాయ్స్ వచ్చి ఐటమ్స్ ఇచ్చే వరకు అసలు విషయం తెలియలేదు. స్వీట్స్ బాక్స్ కు బదులుగా టీవీలు, ఫ్రిడ్జ్ లు ఇలా కుప్పలు తెప్పలుగా తీసుకొచ్చారు డెలివరీ బాయ్స్. అది కూడా ఫ్రీగా ఏం కాదు. క్యా్ష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్. అది చూసి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది అనుకోండి వీరమణికి. 

రూ.లక్షా 70 వేల టీవీ:

టీవీలు, ఫ్రిడ్జ్ లు, వాషింగ్ మెషీన్స్, కిచెన్ సామాను, ఇంటి సామాను ఇలా లోడ్ల మీద లోడ్లు వీరమణి ఇంటికి రావడంతో కాలనీ వాసులంతా షాకయ్యారు. ఇవన్నీ నేను ఆర్డర్ చేయలేదురా బాబోయ్ అంటూ తల పట్టుకున్నాడు వీరమణి. ఒక టీవీ అయితే ఏకంగా లక్షా 69 వేల రూపాయలు ఉండగా.. ఆర్డర్ చేశారుగా.. డబ్బులు ఇవ్వండి సార్ అంటూ డెలివరీ బాయ్స్ అడుగుతుంటే ఏంచేయాలో తోచని పరిస్థితి. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by veeramani (@veeramani_121)

70 కోట్ల యుద్ధ ట్యాంక్!

వీరమణి ఇంటికి 70 కోట్ల రూపాయల విలువైన యుద్ధ ట్యాంక్ కూడా వచ్చినట్లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. T-90 మిలిటరీ ట్యాంక్ కూడా ఫ్యాన్స్ ఆర్డర్ చేసినట్లు వార్తలు  వచ్చాయి. దీనితో పాటు అంబులెన్స్, రాకెట్ కూడా ఆర్డర్ చేసినట్లు న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. అయితే యుద్ధ ట్యాంక్ వగైరా అంతా ఫేక్ న్యూస్ అని తేలింది. టీవీలు, ఇంటి సామాన్లు వచ్చిన మాట మాత్రం వాస్తవం. 

ఇల్లు ఖాళీ చేసిన వీరమణి:

వీరమణిని ఆటపట్టించేందుకు ఫ్రాంక్ చేసినట్లుగా ఫ్యాన్స్ ఆర్డర్ చేసినప్పటికీ.. కొంత వరకు ప్రాంక్ లాగే అనిపించినా.. కాస్త తలనొప్పి వ్యవహారంలా మారింది ఈ విషయం. ఆర్డర్ వచ్చింది డబ్బులు చెల్లించండి అంటూ డెలివరీ బాబ్స్ వేధింపులు.. దీనితో నేను ఆర్డర్ చేయలేదు.. నాకు సంబంధం లేదు.. నా దగ్గర అంత డబ్బు లేదు అంటూ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by veeramani (@veeramani_121)

ప్రాంక్ ఆపండ్రా బాబో అంటూ ఫ్యాన్స్ ను వేడుకుంటూ వీడియో మెసేజ్ లు పెట్టాడు వీరమణి. చివరకు చేసేదేమీ లేక.. ఇంతకు మించీ.. వీరమణి తన ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. తను ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో పోస్ట్ చేశాడు. 

వీరమణి ఎపిసోడ్ గురించి తెలిసిన వాళ్లు కొందరు బాగయ్యింది అనుకుంటుంటే.. కొందరేమో అలా ఆటపట్టిండచం ఎంత వరకు సమంజసం అంటున్నారు. కామెడీ, ప్రాంక్ చేయడం కొంత వరకే. .కానీ ఇల్లు ఖాళీ చేసేలా వేధించడం సరికాదని అంటున్నారు. మరి ఏది పడితే అది చెప్పి విసిగించవచ్చా.. దానికంటే పండుగకు స్వీట్లు పంపమని అడగటమేంటి..? అంటూ కొందరు రిప్లై ఇస్తున్నారు.