మలక్‭పేట ఘటనపై దర్యాప్తునకు నిపుణుల కమిటీ

మలక్‭పేట ఘటనపై దర్యాప్తునకు నిపుణుల కమిటీ

హైదరాబాద్ : మలక్ పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు మృతిచెందిన ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. ఆర్డీవో, హెల్త్ కమిషనర్ హామీతో బాధిత బంధువులు ఆందోళన విరమించారు. బాలింతలు మృతిచెందిన ఘటనపై దర్యాప్తునకు నిపుణుల కమిటీ వేశామని హెల్త్ కమిషనర్ అజయ్ కుమార్ తెలిపారు. కమిటీ ఇచ్చే దర్యాప్తు నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. మృతిచెందిన బాలింతలకు సర్జరీ జరిగిన రోజే మరో 11 సర్జరీలు కూడా జరిగాయని చెప్పారు. మిగిలిన వారికి ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కాలేదని.. కానీ ఇద్దరికే ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలిగాయని హెల్త్ కమిషనర్ తెలిపారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామని స్పష్టం చేశారు. 

మలక్ పేట ఆస్పత్రిలో జరిగిన ఘటనపై ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావుతో మాట్లాడామని ఆర్డీవో వెంకటేశ్వర్లు తెలిపారు. చనిపోయిన బాలింతల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేస్తామన్నారు.