
దాదాపు పదేళ్ళ తరువాత గీతాంజలి సినిమాకు సీక్వెల్ గా గీతాంజలి మళ్ళీ వచ్చింది(Geethanjali Malli Vachindi) సినిమాను తెరకెక్కించారు ప్రముఖ రచయిత కోన వెంకట్. ఈ సినిమాను శివ తుర్లపాటి తెరకెక్కించగా ఏప్రిల్ 11న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. హారర్ కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు మేకర్స్ ఆశించినంతగా కలెక్షన్స్ రాలేదు. దీంతో ఈ సినిమా రిలీజై నెల తిరగకముందే ఓటీటీలోకి వచ్చేసింది.
తాజాగా ఆహా ఇదే విషయంపై అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ సినిమాను మే 8 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. కానీ, సాయంత్రం అయ్యే వరకు కూడా ఓటీటీకి రాకపోవడంతో..వస్తుందా లేదా అనే సందేహంలో ఉన్నారు. ఇక ఎట్టకేలకు సాయంత్రం 7 గంటలకు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది.
నిజానికి ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. తాజాగా వచ్చిన ప్రకటనతో హ్యాపీగా ఫీలవుతున్నారు. మరి థియేటర్స్ లో ఓ మోస్తారు విజయాన్ని సాదించిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
పార్ట్ 2 అంటే పగ గట్టిగా ఉండొచ్చు...?
— ahavideoin (@ahavideoIN) May 8, 2024
మళ్లీ వచ్చిందంటా గీతాంజలి...చూడండి మరి!?
Watch #GeethanjaliMalliVachindi streaming now!??https://t.co/svIET6uz1k#Anjali50 @yoursanjali @konavenkat99 @MP_MvvOfficial #GV #ShivaTurlapati #SujathaSiddarth @Actorysr @Satyamrajesh2… pic.twitter.com/tufKXzNbFj
కథేంటంటే:
‘గీతాంజలి’ సినిమా తీసి తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా సత్తా చాటిన శ్రీను అలియాస్ శ్రీనివాస్ (శ్రీనివాస్ రెడ్డి) ఆ తర్వాత హ్యాట్రిక్ ఫ్లాప్‌లు ఇస్తాడు. ఫలితంగా చేతిలో అవకాశాలు లేక ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటాడు.ఈ క్రమంలోనే పొట్టకూటి కోసం వైజాగ్‌లో ఉంటున్న తన మిత్రుడు అయాన్ (సత్య)ను హీరో చేస్తానని చెప్పి మోసం చేస్తూ ఉంటాడు. ఒకరోజు హైదరాబాద్ వచ్చిన అయాన్.. తాను మోసపోయానని అర్థమై శ్రీను పరిస్థితి చూసి ఏమీ చేయలేకపోతాడు. అప్పుడే అయాన్, శ్రీనులతో పాటు తన సహ రచయితలు ఆరుద్ర (షకలక శంకర్), ఆత్రేయ (సత్యం రాజేష్) గ్యాంగ్ ఓ ఆలోచన చేస్తారు.
ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకుంటారు. సరిగ్గా అప్పుడే ఊటీలో ఉండే విష్ణు రిసార్ట్స్ యజమాని విష్ణు (రాహుల్ మాధవ్) మేనేజర్ నుంచి శ్రీనుకు ఓ ఫోన్ వస్తుంది. తనతో ఓ హారర్ థ్రిల్లర్ సినిమా నిర్మిస్తానని చెప్పి.. ఓ కథను శ్రీను గ్యాంగ్ చేతిలో పెడతాడు. కాకపోతే ఆ కథను తాను కొన్న సంగీత్ మహల్‌లోనే చిత్రీకరించాలని షరతు పెడతాడు.
ఆ కథ కోసం హీరోయిన్ గా అంజలి (అంజలి)ని తీసుకోమని సూచిస్తాడు. వాళ్లంతా విష్ణు మాట ప్రకారమే సినిమాని ఆ మహల్‌లోనే తీసేందుకు సిద్ధమై అక్కడ అడుగు పెడతారు. మరి ఆ మహల్‌లోకి అడుగు పెట్టిన హీరోయిన్ అంజలి, శ్రీను గ్యాంగ్‌కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? విష్ణు తన సినిమాని ఆ మహల్‌లోనే చిత్రీకరించాలని ఎందుకు అంతలా పట్టుబట్టాడు? తన చిత్రాన్ని అంజలి, శ్రీనుల చేతుల్లోనే ఎందుకు పెట్టాలనుకున్నాడు ? వీళ్ల కోసం గీతాంజలి ఆత్మ మళ్లీ ఎందుకు తిరిగొచ్చింది? అనేది చూసి తెలుసుకోవాల్సిందే.