Prashanth Neel: కేజీఎఫ్ 3పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్..స్క్రిప్ట్ రెడీ..కానీ డైరెక్టర్ ఎవరంటే?

Prashanth Neel: కేజీఎఫ్ 3పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్..స్క్రిప్ట్ రెడీ..కానీ డైరెక్టర్ ఎవరంటే?

కన్నడ స్టార్ యష్ నటించిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'కేజీఎఫ్','కేజీఎఫ్ 2'ఎంత హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండో భాగం రిలీజై బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ప్రాంతంతో తేడా లేకుండా విడుద‌లైన ప్రతి భాష‌లోనూ వ‌సూళ్ళ పరంపరను కొనసాగించింది.

బాలీవుడ్‌లో ఈ చిత్రం స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసింది. దాంతో పాటు ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించిన ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది.దీంతో కేజీఎఫ్'మూడో భాగంపై యష్ ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి. 

అయితే ఎవరూ ఊహించని విధంగా కేజీఎఫ్ 3 గురించి నీల్ అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం కేజీఎఫ్ 3 పనులు కొనసాగుతున్నాయని. త్వరలో  స్టోరీలైన్ పూర్తయ్యేందుకు చివరి దశలో ఉందన్నారు.నేను దర్శకుడనో కాదో నాకు తెలియదు.కానీ యష్ ఎల్లప్పుడూ కేజీఎఫ్ లో భాగమవుతాడు. అందుకోసమే మేము దానిని ప్రకటించలేదని అన్నారు.అలాగే ఈ నెల ఆఖరు నుంచి సలార్ 2 సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుందని తెలిపారు.

ఇప్పటికే తెరకెక్కించిన రెండు భాగాలతో ఓ ఊపేసిన నీల్..సడెన్ గా మూడో భాగం డైరెక్టర్ విషయంలో నెలకొల్పిన ఈ సందిగ్నంతో ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ కంగారులో ఉన్నారు. ఏమవుతుందో చూడాలి.  

కన్నడ ఇండస్ట్రీని పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కడానికి కారణమైన KGF ఫ్రాంచైజ్ 3కి సంబంధించిన చిన్న అప్డేట్ వినబడగానే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు..దీంతో ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని వెయిట్ చేస్తున్నారు.ఒక్కమాటలో చెప్పాలంటే, అత్యంత శక్తిమంతుడైన వ్యక్తి నిలబెట్టిన అత్యంత శక్తివంతమైన వాగ్దానం ఈ చిత్రం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.