బీ అలర్ట్ : రోజూ బీరు తాగుతున్నారా.. అయితే ఈ ఐదు రోగాలు వచ్చి చస్తారు..!

బీ అలర్ట్ : రోజూ బీరు తాగుతున్నారా.. అయితే ఈ ఐదు రోగాలు వచ్చి చస్తారు..!

బీర్..యూత్ ఎక్కువగా ఇష్టపడే డ్రింక్. ఓ బంధువొచ్చినా..ఓ ఫ్రెండ్ కలిసినా..ఆనందంలో ఉన్నా..విషాదంలో ఉన్నా..ఇప్పుడు బీర్ తాగడం అనేది కామన్ అయిపోయింది. పండగలు, జాతరలు ఇలా సందర్భం ఏదైనా బీరు లేకుండా అవి జరగవంటారు యూత్.. అయితే బీర్ మితంగా తాగితే ప్రమాదం లేదంటున్నారు డాక్టర్లు.. అలా కాకుండా రోజూ బీర్ తాగుతుంటే ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు. బీర్ ఎంత తాగాలి.. ఏ మోతాదులో తాగితే ఆరోగ్యానికి మంచిది అనే విషయాలను తెలుసుకోవడం చాలా అవసరం.. ఇంకెందుకు ఆలస్యం తెలుసుకుందాం రండి.. 

చాలామంది..ఇవాళ చాలా ఒత్తిడికి లోనయ్యాం..శారీరక శ్రమ బాగా చేశాం..ఓ బీర్ కొట్టి రెస్ట్ తీసుకుంటే చాలా హాయిగా ఉంటుందంటూ.. ఏదో సాకుతో రోజూ బీర్లు తాగుతుంటారు. ‘‘తాగినప్పుడల్లా ఓ నాలుగైదు బీర్లు తాగితే గానీ వారికి సరిపోదు..’’ అని కొంతమంది అంటుంటే మనం తరుచుగా వింటుంటాం.. నిజంగా బీర్ తాగితే మనకు విశ్రాంతినిస్తుందా? లేక ఆరోగ్యానికి హానికరమా?

బీర్లు అప్పుడప్పుడు తన బాడీకి కావాల్సిన మోతాదులో  తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తవు అంటున్నారు డాక్టర్లు.. అలా కాదు.. రోజూ బీర్లు కొడతాం.. అంటే మాత్రం మీ ఆరోగ్యాన్ని మీరు చేజేతులా చెడగొట్టున్నట్లే అంటున్నారు. అధికంగా , రోజూ బీర్లు తాగితే వచ్చే ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం.. 

బరువు పెరగడం: 

బీర్లలో క్యాలరీలు పుష్కలంగా ఉంటాయి.బీర్లలో ముఖ్యంగా క్రాఫ్ట్, ఫ్లేవర్డ్ రకాల్లో అధిక కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది. ఇది కాలక్రమేణా అధిక బరువుకు దారితీస్తుంది. అదనంగా ఆల్కహాల్ వినియోగం ఆకలిని పెంచుతుంది కూడా. ఇది చెత్త ఆహార పదార్థాలను తినేలా చేస్తుంది. దీంతో బరువు పెరగడం జరుగుతుంది. 

కాలేయానికి హాని: 

కాలేయం ఆల్కహాల్ ను డైజెస్ట్ చేస్తుంది. శరీరానికి హాని కలిగించే వాటిని విభజిస్తుంది. దీర్ఘకాలికంగా ఆల్కహాల్ వినియోగం వల్ల కాలేయంలో వాపు, కొవ్వు పెరిగిపోతాయి ఫలితంగా సిర్రోసిస్ వంటి కాలేయ వ్యాధులకు దారితీస్తుంది. కాలేయం పనితీరును దెబ్బతీస్తుంది. దీంతో మొత్తం ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. 

గుండె జబ్బులు రావొచ్చు 

కొన్ని అధ్యయనాలు మితమైన ఆల్కహాల్ హార్ట్ కు మంచిదే అని సూచిస్తున్నప్పటికీ అధికంగా బీర్ తీసుకోవడం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. క్రమం తప్పకుండా బీర్ తాగడం వల్ల రక్తపోటును పెంచుతుంది. ట్రైగ్లిజరైడ్ స్థాయిలను పెంచుతుంది. దీంతో గుండె జబ్బులు వచ్చే అవకాశం లేకపోలేదు. అందుకే బీర్లు కూడా మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. 

జ్ణాపక శక్తి పై ప్రభావం 

అల్కహాల్ మెదడు పనితీరును ప్రభావితం చేస్తుందని మనకు తెలుసు. అధికంగా బీర్లు తాగితే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత దెబ్బతింటుంది. రెగ్యులర్ గా బీర్లు తాగితే మెదడు పనితీరు క్షీణిస్తుంది. అల్టీమర్స్, ఆలోచనలు స్థిరంగా ఉండకపోవడం వంటి పరిస్థితులకు దారి తీస్తుంది. రోజూబీరు తాగే వ్యక్తులు  వారి మానసిక స్థితి, మొత్తం మెదడు ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుందని అంటున్నా నిపుణులు. 

బలహీనమైన అభిజ్ఞా పనితీరు:

ఆల్కహాల్ అభిజ్ఞా పనితీరును ప్రభావితం చేస్తుంది మరియు అధిక బీర్ వినియోగం జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మరియు తీర్పును దెబ్బతీస్తుంది. దీర్ఘకాలిక ఆల్కహాల్ దుర్వినియోగం కాలక్రమేణా అభిజ్ఞా క్షీణతకు దారితీయవచ్చు, చిత్తవైకల్యం మరియు అల్జీమర్స్ వ్యాధి వంటి పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతుంది. ప్రతిరోజూ బీర్ తాగే వ్యక్తులు వారి మానసిక స్పష్టత మరియు మొత్తం అభిజ్ఞా ఆరోగ్యంపై దాని ప్రభావాన్ని గుర్తుంచుకోవాలి.

వ్యసనానికి దారితీస్తుంది

రెగ్యులర్ గా బీరు తాగితే ఆల్కహాల్ డిపెండెన్స్, వ్యసనానికి దారి తీయొచ్చు. బీర్ ఆల్కహాల్ మాదిరిగానే మానసిక, శరీరక వ్యసనంగా మారొచ్చు. రోజులు గడిచే కొద్దీ బీర్లు తాగడం అనేది వ్యక్తిగత సంబంధాలు, అతని పనీతీరు, జీవన విధానంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.. సో.. బీర్లు తాగేముందు.. బీకేర్ ఫుల్..  వచ్చి చస్తారు..!