కేరళలో కొత్త రకం జ్వరం.. ఇప్పటికే మూడు కేసులు.. సర్కార్ హై అలర్ట్

కేరళలో కొత్త రకం జ్వరం.. ఇప్పటికే మూడు కేసులు.. సర్కార్ హై అలర్ట్

కేరళా రాష్ట్రంలో కొత్త రకం జ్వరం కలవరం సృష్టిస్తోంది. వెస్ట్ నైల్ ఫీవర్ అనే జ్వరం రాష్ట్రవ్యాప్తంగా మూడు జిల్లాల్లో కేసులు నమెదైయ్యారు. ఇది వెస్ట్ నైల్ అనే దోమ వల్ల వ్యాపిస్తోంది. దీంతో ఆరోగ్య శాఖ రైనీ సిజన్ కు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించింది. కేరళలోని మలప్పురం, కోజికోడ్, త్రిస్సూర్‌ జిల్లాల్లో వెస్ట్ నైల్ ఫీవర్ కేసులు బయట పడ్డాయి. రెండేళ్ల క్రితం కేరళ రాష్ట్రంలో వెస్ట్ నైల్ ఫీవర్ కారణంగా ఓ వ్యక్తి మరణించిన సంగతి తెలిసిందే. క్యూలెక్స్ జాతి దోమల ద్వారా వ్యాపించే ఈ జ్వరం అంతకుముందు 2019లో కేరళలో ప్రాణాలను బలిగొంది.    

ఈ ఫీవర్ బారిన పడినవారిలో జ్వరం, తలనొప్పి, అలసట, శరీర నొప్పులు, వికారం, వాంతులు మరియు అప్పుడప్పుడు చర్మంపై దద్దుర్లు, శోషరస గ్రంథుల వాపు వంటి లక్షణాలు ఉంటాయి. చిన్నపాటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించి చికిత్స తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. వ్యాధి తీవ్రత పెరిగితే తలనొప్పి, అధిక జ్వరం, మెడ దృఢత్వం, మూర్ఛ, అయోమయం, కోమా, వణుకు, మూర్ఛలు, కండరాల బలహీనత మరియు పక్షవాతం వంటివి సంభవిస్తాయి.