రైల్వే టికెట్లలో  గర్భిణులకు  ప్రయారిటీ ఇవ్వండి

రైల్వే టికెట్లలో  గర్భిణులకు  ప్రయారిటీ ఇవ్వండి

ముషీరాబాద్, వెలుగు: రైల్వే టికెట్ కన్ఫర్మేషన్ విషయంలో గర్భిణులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రత్యేక హోదా కల్పించాలని రైల్వే డీఆర్​యూసీసీ కమిటీ సభ్యులు కే. సాయిబాబా విజ్ఞప్తి చేశారు. గర్భిణులకు రిజర్వేషన్ కన్ఫర్మ్ కాకపోవడంతో జనరల్ బోగీల్లో ప్రయాణిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

టికెట్ బుక్ చేసే సమయంలోనే మెడికల్ సర్టిఫికెట్ ఆధారంగా వారికి ప్రత్యేక కోటా ద్వారా సీటు కేటాయించాలని కోరుతూ సోమవారం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్​కు ఆయన లేఖ రాశారు. అలాగే ప్రయాణికుల భద్రత కోసం ప్రతి రైల్లో ఆర్పీఎఫ్ పోలీసుల సంఖ్యను పెంచాలని సూచించారు.