నీలోఫర్  హాస్పిటల్లో కలకలం.. సెలైన్ ఎక్కిస్తుండగా  చిన్నారులకు జ్వరం!

నీలోఫర్  హాస్పిటల్లో కలకలం.. సెలైన్ ఎక్కిస్తుండగా  చిన్నారులకు జ్వరం!

మెహిదీపట్నం, వెలుగు: నగరంలోని నీలో ఫర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్నారులకు సెలైన్ ఎక్కిస్తుండగా ఒక్కసారిగా జ్వరం రావడంతో ఆందోళన నెలకొంది. వివిధ అనారోగ్య కారణాలతో పీడియాట్రిక్ విభాగంలో చేరిన 8 మంది చిన్నారులకు సోమవారం సెలైన్ ఎక్కిస్తుండగా ఒకరి వెనక మరొకరికి జ్వరం అందుకుంది.

దీంతో   చిన్నారులకు అత్యవసర వైద్యం అందించినట్టు సమాచారం.  దీనిపై దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ కుమార్  ను వివరణ కోరగా.. అలాంటిదేమీ లేదని, చిన్నారులందరూ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు