విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో గోలి రామకృష్ణ దర్శకనిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం ‘ఆర్’. గాలి బాల కిరణ్ రెడ్డి కో ప్రొడ్యూసర్. సోమవారం ఉదయం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా దర్శకనిర్మాత గోలి రామకృష్ణ మాట్లాడుతూ ‘ఈనెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నాం. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెండు షెడ్యూల్స్‌లో పూర్తి చేసి అక్టోబర్ 17న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. చక్కని కథతో సందేశాత్మకంగా తెరకెక్కిస్తున్నాం’ అని చెప్పారు. సంతోష్ కృష్ణన్, భాగ్య రెడ్డి, బ్రహ్మానందం, దుర్గమ నాయుడు, పవన్, సిరి, సంధ్య, భాను చందర్, స్వాతి తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.
