సత్య లీడ్ రోల్‌లో రితేష్ రానా తెరకెక్కిస్తున్న చిత్రం ‘జెట్లీ’. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయిందని మేకర్స్ తెలియజేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోందని అన్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ వీడియోలో సత్య ఫన్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్ పోస్టర్స్, గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంతో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా తెలుగులో పరిచయం కానుంది. వెన్నెల కిశోర్, అజయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘మత్తు వదలరా’ మూవీకి వర్క్ చేసిన మెయిన్ టీం ఈ సినిమాకు పని చేస్తున్నారు. మ్యూజిక్ కాల భైరవ, సినిమాటోగ్రాఫర్ సురేష్ సారంగం, ఎడిటర్ కార్తీక శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైనర్ నార్ని శ్రీనివాస్‌తో కలిసి రితేష్ రానా మరోసారి తనదైన హాస్యాన్ని పండించడానికి రెడీ అవుతున్నాడు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు.
