SRH vs LSG: పొట్టు పొట్టు కొట్టిన సన్‌రైజర్స్‌ ఓపెనర్లు.. 10 ఓవర్లలోపే మ్యాచ్ ఫినిష్

SRH vs LSG: పొట్టు పొట్టు కొట్టిన సన్‌రైజర్స్‌ ఓపెనర్లు.. 10 ఓవర్లలోపే మ్యాచ్ ఫినిష్

గత రెండు మ్యాచ్‌ల్లో తడబడిన సన్‌రైజర్స్‌ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్.. మళ్లీ యథాస్థితికి వచ్చేశారు. తమ పిచ్చి కొట్టుడు ఎలా ఉంటుందో.. సొంతగడ్డపై లక్నో బౌలర్లకు చూపెట్టారు. వీరి ఆట చూసి ప్రేక్షకులకే విసుగొచ్చింది. అంతలా వీరి విధ్వంసం సాగింది. ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బాదడం మొదలుపెట్టిన ఈ జోడీ.. 166 పరుగుల లక్ష్యాన్ని 9.4 ఓవర్లకే  చేధించారు. అభిషేక్ శర్మ(75 నాటౌట్: 28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్ లు), ట్రావిస్ హెడ్(89 నాటౌట్: 30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్ లు) పరుగులు చేశారు. 

166 పరుగుల చేధనకు దిగిన హైదరాబాద్ ఓపెనర్లు లక్నో బౌలర్లపై ఏ మాత్రం జాలి చూపలేదు. అంతర్జాతీయ బౌలర్ అని ఎక్కడా చెప్పుకోకుండా కొట్టారు. తమ విధ్వంసపు ఆటతో 10 ఓవర్లలోపే మ్యాచ్ ముగించారు.  వీరి కొట్టుడు ధాటికి లక్నో బౌలర్లు ఎకనామీలు రికార్డు స్థాయికి చేరాయి.  క్రిష్ణప్ప గౌతమ్ 29(2 ఓవర్లలో), యశ్ ఠాకూర్ 37(2 ఓవర్లలో), నవీన్-ఉల్-హక్ 37(2 ఓవర్లలో), రవి బిష్ణోయ్ 24(2 ఓవర్లలో) పరుగులు ఇచ్చారు.

ఆదుకున్న బదోని, పూరన్‌ 

అంతకుముందు లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. టాపార్డర్‌ విఫలమైన వేళ పూరన్‌ (26 బంతుల్లో 48 నాటౌట్), ఆయుష్ బదోని(30 బంతుల్లో 55 నాటౌట్) జోడి లక్నోకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించారు.