నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. హార్థిక్ పాండ్యా ఎక్కడకెళ్లినా గర్ల్ ఫ్రెండ్ను వదలట్లా..!

నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. హార్థిక్ పాండ్యా ఎక్కడకెళ్లినా గర్ల్ ఫ్రెండ్ను వదలట్లా..!

హార్థిక్ పాండ్యా, మహికా శర్మ రిలేషన్ ఏంటనేది ఓపెన్ సీక్రెట్. ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. భార్య నుంచి విడాకులు తీసుకున్న హార్థిక్ పాండ్యా.. మహికా శర్మను పెళ్లి మాత్రమే చేసుకోలేదు గానీ భార్య కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు. హార్థిక్ పాండ్యా ఎక్కడ ఉంటే అక్కడ మహికా కూడా కనిపిస్తుంది.

టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ల్లో.. టీమిండియా ప్రతీ మ్యాచ్ సమయంలో హార్థిక్ పాండ్యాతో పాటు మహికా కూడా టీమిండియా జట్టుతో పాటు కనిపిస్తోంది. తాజాగా.. అహ్మదాబాద్ సిటీలో ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియా అహ్మదాబాద్ వెళుతుంది. ముంబై ఎయిర్ పోర్ట్ నుంచి హార్థిక్ పాండ్యాతో పాటు ముంబై వెళుతూ మహికా శర్మ కనిపించింది.

అంతేకాదు.. గంభీర్కు కూడా తనతో పాటు మహికా ఉందని హార్థిక్ పాండ్యా పరిచయం చేశాడు. టీమిండియా, ఇంగ్లండ్ మధ్య వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్కు కూడా మహికా శర్మ వెళ్లింది. హార్థిక్ పాండ్యా కొడుకుతో కలిసి మ్యాచ్ చూసింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కూడా కావడం గమనార్హం.

హార్థిక్ పాండ్యా, మహికా శర్మ రిలేషన్ గురించి ఎంత మాత్రం అందరికీ తెలిసినా ఇలా ప్రతీ మ్యాచ్ సమయంలో వెంట తీసుకుని వెళుతుండటంతో హార్థిక్ పాండ్యాపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మ్యాచ్లో మంచిగ ఆడితే ఎలాంటి గొడవా లేదు. పొరపాటున టైం మంచిగ లేక హార్థిక్ పాండ్యా ఆట సక్కగ లేకపోతే వేళ్లన్నీ మహికా శర్మ వైపు చూపించే ప్రమాదం లేకపోలేదు.