Ranveer, Deepika: విడాకుల బాటలో మరో బాలీవుడ్ జంట.. క్లారిటీ వచ్చేసింది!

Ranveer, Deepika: విడాకుల బాటలో మరో బాలీవుడ్ జంట.. క్లారిటీ వచ్చేసింది!

ఈమధ్య సెలబ్రెటీల విడాకుల విషయాలు చాలా కామన్ అయ్యాయి. ప్రేమించి పెళ్లిచేసుకున్న స్టార్స్ సైతం అనివార్య కారణాల వల్ల విడిపోతున్నారు. తాజాగా ఈ లిస్టులోకి మరో స్టార్ కపుల్ చేరనున్నారా. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ స్టార్ కపుల్ మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటీఫుల్ జంట రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనె. అవును.. ముచ్చటైన ఈ జంట త్వరలో విడిపోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో దారుణంగా వైరల్ అవుతున్నాయి. 

దానికి కారణం.. రణ్వీర్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ నుండి తమ పెళ్లి ఫోటోలు తొలగించడమే. అవును.. ఈ మధ్యే రణ్వీర్ తమ పెళ్లి ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ నుండి తొలగించాడు. ఒక్కటంటే.. ఒక్క ఫోటో కూడా అందులో ఉంచలేదు. దాంతో.. ఈ జంట కూడా త్వరలో విడాకుల బాట పట్టనున్నారు అనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే.. ఈవార్తల్లో ఏమాత్రం నిజం లేదని బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి టాక్ వినిపిస్తోంది. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. రణ్వీర్ సింగ్ ఈ మధ్యే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను ఆర్చీవ్ చేశారట. ఆ కారణంగా తన అకౌంట్ లో 2023కి ముందు పెట్టిన పోస్టులన్నీ ఆర్చీవ్ అయ్యి కనబడటం లేదట. అది గమనించిన చాలా మంది రణ్వీర్, దీపికా కూడా విడాకులు తీసుకోనున్నారని అనుకున్నారట. కానీ, వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ వచ్చేసింది. ఇక ప్రస్తుతం ఈ ఇద్దరు తమ తమ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక దీపిక ప్రభాస్ తో కల్కి సినిమా చేస్తున్నారు. పాన్ వరల్డ్ రేంజ్ లో వస్తున్న ఈ సినిమా జూన్ 27న విడుదల కానుంది.