రిజిస్ట్రేషన్ తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్లే ఇస్తాం.. సీఎం జగన్ 

రిజిస్ట్రేషన్ తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్లే ఇస్తాం.. సీఎం జగన్ 

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఈ యాక్ట్ ద్వారా జగన్ ప్రజల భూములను దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారని ప్రతిపక్షాలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ అంశంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయంటూ అధికార వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేయగా సీఐడీ చర్యలకు ఆదేశించింది ఈసీ. ఈసీ  ఆదేశాల మేరకు సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి చంద్రబాబును A1గా చంద్రబాబును A2గా లోకేష్ ను చేర్చింది.

ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సీఎం జగన్ ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూనే ఉన్నాడు. తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. రిజిస్ట్రేషన్ తర్వాత ప్రజలకు ఒరిజినల్ సర్టిఫికెట్లే ఇస్తామని అన్నారు. జిరాక్స్ లు ఇస్తామని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. ఇప్పటివరకు 9లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని, వారందరికీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇచ్చామని క్లారిటీ ఇచ్చారు జగన్. ఎదో జరిగిపోతుందని చంద్రబాబు దిగజారి ప్రచారం చేస్తున్నారని, చంద్రబాబు మోసపూరిత మనిషి అని మండిపడ్డారు జగన్.