తెలంగాణ  ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్గాఎండీ రహీమ్

 తెలంగాణ  ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్గాఎండీ రహీమ్

ఓయూ, వెలుగు: తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్​గా ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి ఎండీ రహీమ్​ను నియమిస్తూ ఆ సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి నియామక పత్రాన్ని అందజేశారు. ఆదివారం  జరిగిన మీడియా సమావేశంలో అన్ని జిల్లాల నుంచి వచ్చిన మలిదశ ఉద్యమకారుల సమక్షంలో ఈ నియామకం జరిగింది. ఈ సందర్భంగా రహీమ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలలో భాగంగా ఉద్యమకారులకు ప్రకటించిన 250 గజాల ఇంటి స్థలం, పింఛన్, గుర్తింపు కార్డులను సాధించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. త్వరలోనే అన్ని జిల్లా కమిటీలను ఏర్పాటు చేసి, మలిదశ ఉద్యమకారులందరినీ ఐక్యం చేస్తామని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని ఆయన హెచ్చరించారు.