అమరావతిలో జ్యుడీషియల్ అకాడమీ : సీజేఐ జస్టిస్ సూర్యకాంత్

అమరావతిలో జ్యుడీషియల్ అకాడమీ : సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
  • శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్​ సూర్యకాంత్

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లోని అమరావతి సమీపంలోని పిచ్చుకలపాలెంలో జ్యుడీషియల్ అకాడమీ నిర్మాణానికి సీజేఐ జస్టిస్​సూర్యకాంత్ ఆదివారం శంకుస్థాపన చేశారు. రూ.165 కోట్లతో అకాడమీని నిర్మించనున్నారు. ఈ అకాడమీలో ప్రతి బ్యాచ్‌లో 120 మంది ట్రైనీ జడ్జిలకు శిక్షణ, వసతి కల్పించనున్నారు. 2.05 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అకాడమీని నిర్మించనుండగా, 500 సీట్ల ఆడిటోరియం, సెమినార్ హాల్, తరగతి గదులు, మూట్ కోర్ట్ హాల్, ల్యాబ్‌లు, లైబ్రరీ, జిమ్, హాస్టల్ గదులు, స్విమ్మింగ్ పూల్ వంటి ఆధునిక సదుపాయాలు ఉంటాయి. 

ఈ కాంప్లెక్స్ ఆంధ్రప్రదేశ్​హైకోర్టుకు 5.7 కిలోమీటర్ల దూరంలో ఉంది. కార్యక్రమంలో సీఎం చంద్రబాబునాయుడుతో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి, జోయ్​మాల్య బాగ్చీ తదితరులు పాల్గొన్నారు.