బెంగళూరులోనూ మొదలైందా : మెట్రోలో యంగ్ కపుల్ రొమాంటిక్ సీన్స్

బెంగళూరులోనూ మొదలైందా : మెట్రోలో యంగ్ కపుల్ రొమాంటిక్ సీన్స్

ఢిల్లీ మెట్రో కల్చర్..ఇప్పుడు బెంగళూరు కూడా పాకింది. ఇటీవల కాలంలో  ఢిల్లీ మెట్రో కోచ్ లో షార్ట్ లెంత్ డ్రెస్సులు, డ్యాన్సులు, ముద్దులు,రొమాన్స్ ఇలా రకర కాలుగా వింత ప్రవర్తనతో రీల్స్ చేయడం, వాటిని సోషల్ మీడియాలో పెట్టడం అనేది కామన్ అయిపోయింది. కేవలం వ్యూస్, లైకులు, ఓవర్ నైట్ లో సెలబ్రిటీలు కావాలనే ఇలాంటి వింత చేష్టలు ఆగడంలేదు.. రైల్వే అధికారులు ఎంత చెప్పినా.. మీరు చెప్పేది చెప్పండి.. మేం చేసేది చేస్కుంట పోతాం అన్నట్లుగా మహిళలు, యూత్ ప్రవర్తిస్తున్నారు. మేమేం తక్కువా అని అనుకున్నారేమో.. బెంగళూరు కపుల్స్.. ఏకంగా మెట్రోలోనే రోమాన్స్ లో మునిగి పోయారు. ఇది చూసిన ఓ ప్యాసింజర్ .. రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. 

అసలేం జరిగిందంటే.. బెంగళూరు మెట్రోలో ఓ యంగ్ కపుల్ రోమాన్స్ తో తోటి ప్యాసింజర్లను హడలెత్తించారు. మెట్రోలో ఉన్నాం విషయాన్ని కూడా మర్చిపోయి కొన్ని బెడ్ రూం సీన్లను అక్కడున్నవారికి చూపించారు..చాలా క్లోజ్ గా ముద్దులు పెట్టుకుంటూ కనిపించారు. ఇంకేముందు కొంతమందికి ఎంటర్ టైన్ మెంట్ గా అనిపించినా..మరొకొందరికి ఆగ్రహాన్ని తెప్పించింది.. అందులో ఓ ప్రయాణికుడు వారి రొమాన్స్ సీన్లను చిత్రీకరించి సోషల్ మీడియోల పోస్ట్ చేశారు.. దీంతో పాటు ట్యాగ్ కూడా రాశాడు.. 

అందేంటంటే.. మెట్రోలో అసలేం  జరుగుతోంది.. రాను రాను బెంగళూరు మెట్రో కూడా ఢిల్లీ మెట్రోలా తయారైంది.. బహిరంగ ప్రదేశాల్లోఅమ్మాయి ఇలా అబ్బాయిని ముద్దు పెట్టుకోవడం ఏంటీ.. అంటూ తనదైన శైలిలో రాసుకొచ్చాడు. ఈ వీడియో క్లిప్ ను మెట్రో అధికారులకు కూడా షేర్ చేశాడు.  వెంటనే ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. 
ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొంత మంది వారి ముద్దులు వారిష్టం అన్నట్లు కామెంట్లు పెడితే.. మరికొందరు పబ్లిక్ ప్లేసుల్లో ఇదేం పని అని విసుక్కున్నారు. 

ఓ నెటిజన్ స్పందిస్తూ..వారిపై సెక్షన్ 354C IPC కింద కేసు పెట్టి మూడు సంవత్సరాల జైల్లో పెట్టాలి అని ఘాటుగానే ప్రతిస్పందించాడు. మరో నెటిజన్ స్పందిస్తూ.. వారి సంతోషాన్ని చూడలేకపోతే కళ్లు మూసుకోండి.. వీని వల్ల ఎవ్వరికి హానీ లేదు గానీ.. వారికి బదులుగా బహిరంగంగా మూత్ర విసర్జనర్జ , మల విసర్జనర్జ చేసే వారిని శిక్షిద్దాం. అంటూ ఓ సలహా పడేశారు. 

ఇక ఈ విషయం తెలిసిన బెంగళూరు మెట్రో అథారిటీ.. చాలా సీరియస్ గానే  స్పందించింది. గతంలో ఢిల్లీ మెట్రో కోచ్ లలో కూడా వ్యక్తులు ఇలాంటి వింత చేష్టలకు పాల్పడిన సందర్భాలున్నాయి.. ఇలాంటి చర్యలకు  పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.