సోషల్ మీడియా లో వేధింపుల పై యాంకర్ విష్ణుప్రియ ఫిర్యాదు

సోషల్ మీడియా లో వేధింపుల పై యాంకర్ విష్ణుప్రియ ఫిర్యాదు

మియాపూర్‌‌, వెలుగు: సోషల్ మీడియాలో వేధింపులు వస్తున్నాయంటూ యాంకర్ విష్ణుప్రియ పోలీసులను ఆశ్రయించారు. అసభ్యకర పోస్టులు, అభ్యంతరకర కామెంట్లు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

తన ప్రతిష్టకు భంగం కలిగించేలా, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా పోస్టులు పెడుతూ దుష్ప్రచారం చేస్తున్నారని విష్ణుప్రియ వాపోయారు. మే 18న ఫిర్యాదు చేశానని, సంబంధిత సోషల్ మీడియా అకౌంట్ల వివరాలు, పోస్టుల స్క్రీన్‌‌షాట్లను అందజేసేందుకు ​వచ్చినట్లు తెలిపారు.