నా కోసం మారావా.. నన్నే మార్చేశావా? 

నా కోసం మారావా.. నన్నే మార్చేశావా? 

‘లడ్డుండా’ అంటూ మాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ప్రమోషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్పీడు పెంచిన ‘బంగార్రాజు’ మూవీ టీమ్, నిన్న సెకెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. విలేజ్ బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నాగచైతన్య, కృతీశెట్టి జంటపై తీసిన ఈ మెలోడియస్ సాంగ్ వినగానే ఇంప్రెస్ చేసేలా ఉంది. ‘నా కోసం మారావా నువ్వు, లేక నన్నే మార్చేశావా నువ్వు’ అంటూ సాగే ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. ‘నవ్వులే చల్లావు.. పంచుకోమన్నావు.. తొలకరి చిరుజల్లై నువ్వు, కల్లకే దొరికావు.. రంగులా మెరిశావు.. నేలపై హరివిల్లా నువ్వు’ అంటూ బాలాజీ రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి.

‘నీ కోసం మారానే నేను.. నీతో నూరేళ్లు ఉండేలా నేను, నీ వెంటే ఉంటున్నా నేను.. నువ్వే లేకుంటే ఉంటానా నేను’ అంటూ సినిమా కాన్సెప్ట్‌‌ని  చెప్పేలా ఉన్నాయి లిరిక్స్. నాగార్జున, రమ్యకృష్ణ మరో జంటగా కనిపించబోతున్న ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకుడు. జీ స్డూడియోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి నాగార్జున నిర్మిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా యువరాజ్ సినిమాటోగ్రఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, ఝాన్సీ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.