హైదరాబాద్లోని ఐసీఎంఆర్ - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఐసీఎంఆర్- ఎన్ఐఎన్) కన్సల్టెంట్, యంగ్ ప్రొఫెషనల్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. మార్చి 25న అప్లికేషన్ స్వీకరణ ప్రారంభమైంది. ఏప్రిల్ 25తో ముగియనున్నది.
పోస్టు పేరు: కన్సల్టెంట్, యంగ్ ప్రొఫెషనల్స్.
మొత్తం ఖాళీలు: 6.
విభాగాల వారీగా ఖాళీలు: కన్సల్టెంట్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) 01, కన్సల్టెంట్ (సైంటిఫిక్/ టెక్నికల్ – నాన్ మెడికల్) 01, యంగ్ ప్రొఫెషనల్–II (అడ్మినిస్ట్రేషన్) 01, యంగ్ ప్రొఫెషనల్-–II (లీగల్) 01, యంగ్ ప్రొఫెషనల్-–II (ఫైనాన్స్ & అకౌంట్స్) 01,
యంగ్ ప్రొఫెషనల్-–II (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) 01.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎం.కాం/ ఎంబీఏ/ సీఏ (ఇంటర్)/ ఐసీడబ్ల్యూఏ (ఇంటర్)/ సీఎస్ (ఇంటర్)/ ఎంఎస్సీ/ ఎంసీఏ/ బీఈ/ బి.టెక్, ఏదైనా విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్, లా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 40 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మార్చి 25.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 15.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ nin.res.inను సందర్శించండి.
