IPL 2026: ఇదేం బ్యాటింగ్ భయ్యా.. భారీ హిట్టింగ్ చేస్తారనుకుంటే పెవిలియన్కి క్యూ కట్టారు.. షాక్లో ఎస్ఆర్హెచ్

IPL 2026: ఇదేం బ్యాటింగ్ భయ్యా.. భారీ హిట్టింగ్ చేస్తారనుకుంటే పెవిలియన్కి క్యూ కట్టారు.. షాక్లో ఎస్ఆర్హెచ్

IPL 2026: క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ గ్రాండ్‌గా మొదలైంది. చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న ఈ తొలి మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు తేలిపోయారు. టాస్ గెలిచిన ఆర్సీబీ మొదట ఫిల్డింగ్ తీసుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ కి వచ్చిన ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్లు చెలరేగిపోతారని అనుకుంటే తుస్సుమనిపించారు. 

మొదటి ఓవర్లు ఓ సిక్సు కొట్టిన అభిషేక్ శర్మ మంచి ఊపు మీద కనిపించాడు.. ఫస్ట్ రెండు ఓవర్లలో 17 పరుగులు చేసిన ఎస్ ఆర్ హెచ్.. మూడో ఓవర్ లో బౌలింగ్ కి వచ్చిన జాకబ్ డఫీ బౌలింగ్ లోనే భారీ షాట్ ఆడబోయిన అభిషేక్ వికెట్ కీపర్ జితేష్ శర్మకి క్యాచ్ ఇచ్చిన అభి పెవిలియన్ కు చేరుకున్నాడు. కేవలం 8 బంతుల్లో 7 పరుగులు చేశాడు. అనంతరం మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ సైతం ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. 9 బంతుల్లో రెండు ఫోర్లు కొట్టి అదే ఓవర్లో జాకబ్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. బౌండరీ లైన్ వద్ద ఫిల్ సాల్ట్ కి క్యాచ్ ఇచ్చిన హెడ్ డకౌట్ కి వెళ్లిపోయాడు. 

►ALSO READ | IPL 2026: తొక్కిసలాట  మృతులకి నివాళి.. మెమోరియల్ ఏర్పాటు చేసిన ఆర్సీబీ

అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన లోకల్ బాయ్ నితిశ్ కుమార్ రెడ్డి మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. దాదాపు 6 బంతులు కేవలం 1 పరుగు మాత్రమే చేసి అభినందన్ సింగ్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కి వెళ్లిపోయాడు. దీంతో బ్యాటింగ్ భారం మొత్త కెప్టెన్ ఇషన్ కిషన్ పై పడింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో భారీ హిట్టర్లకు పెట్టింది పేరు.. అలాంటి హిట్టర్లు ఈ మ్యాచులో ఘోరంగా విఫలమయ్యారు. ఎస్ఆర్ హెచ్ కోల్పోయిన మూడు వికెట్లను ఆర్సీబీ బౌలర్ జాకబ్ డఫీ ఒక్కడే తీసుకోవడం గమనార్హం. కీలకమైన వికెట్లు కోల్పోయిన ఆరెంజ్ ఆర్మీ కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ ఇషాన్ (33*), హెన్రీచ్ క్లాసెన్ (4*) ఉన్నారు.