IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ప్రారంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన బ్లాక్‌బస్టర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ కి దిగిన ఎస్‌ఆర్‌హెచ్ 29/3తో తీవ్ర కష్టాల్లో పడింది. ఇక ఆర్మెంజ్ ఆర్మీ కెప్టెన్ ఇషాన్ కిషన్ కేవలం 27 బంతుల్లోనే అద్భుతమైన అర్ధశతకంతో ( 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సులతో 80 పరుగులు) జట్టుని ఆదుకున్నాడు. ఇక సెంచరీ దిశకు వెళ్తున్న క్రమంలో అభినందన్ సింగ్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడిన ఇషన్ బౌండరీ లైన్ వద్ద ఫిల్ సాల్ట్ పట్టిన అద్భుతమైన క్యాచ్ కి పెవిలియన్ బాట పట్టాడు.
అంతకు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు టోర్నీ ప్రారంభ మ్యాచ్ లోనే దారుణంగా విఫలమైయ్యారు. అభిషేక్ శర్మ (8 బంతుల్లో 1 సిక్సుతో 7 పరుగులు), ట్రావిస్ హెడ్ (9 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు), వన్ డౌన్ బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి (6 బంతుల్లో 1 పరుగు) లని ఆర్సీబీ బౌలర్ జాకబ్ డఫ్ఫీ ఔట్ చేశాడు. దీంతో 29 పరుగులకే ఎస్ఆర్హెచ్ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. అప్పుడు బ్యాటింగ్ కి వచ్చిన ఇషాన్, హేన్రిచ్ క్లాసెన్ అద్భుతమైన బ్యాటింగ్ తో స్కోర్ బోర్డు ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో క్లాసెన్ (22 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సుతో 31 పరుగులు) కాసేపు బ్యాట్ ఝలిపించినప్పటికీ రోమారియో షెపర్డ్ బౌలింగ్ లో బౌండరీ లైన్ వద్ద అద్భుతంగా పట్టిన క్యాచ్ తో డకౌట్ కి వెళ్లాడు.
►ALSO READ | మరోసారి ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్.. గోల్ కొట్టి అదరగొట్టారు !
అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన సలీల్ ఆరోరా (9), హర్ష్ దూబే (3), హర్షల్ పటేల్ కూడా విఫలం అయ్యారు. కానీ చివర్లో అనికేత్ వర్మ ( 18 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సులతో 43 పరుగులు) హాఫ్ సెంచరీని జస్ట్ లో మిస్ చేసుకున్నాడు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీయ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. దీంతో ఆర్సీబీ ముందు 202 పరుగుల లక్ష్యాన్ని పెట్టింది ఆరెంజ్ ఆర్మీ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో జాకబ్ డఫీ కీలకమైన 3 వికెట్లు తీసుకోగా, రోమారియో షెపర్డ్ 3 వికెట్లను పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, సుయాష్ శర్మ తలో వికెట్ తీసుకున్నారు.
