ఆ అక్కకు చెబుతున్న.. సామాజిక బహిష్కరణ వరకు తెచ్చుకోవద్దు: సీఎం రేవంత్

ఆ అక్కకు చెబుతున్న.. సామాజిక బహిష్కరణ వరకు తెచ్చుకోవద్దు:  సీఎం రేవంత్

మూసీ నది ఒడ్డున మంచిరేవులలో శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయానికి శంకుస్థాపన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతం నుంచి45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న కుటుంబం.. అన్ని పదవులు అనుభవించిన ఒక అక్క కొడుకు.. ఇవాళ ప్రాజెక్టును అడ్డుకునేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేశాడు. నేను ఆ అక్కకు చెబుతున్న.. ఈ ప్రాంత అభివృద్ధి నీకు పట్టదా..? నీ పుత్ర రత్నం కేసు వేశాడు. ఈ ప్రాంత ప్రజల కోసం.. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వెంటనే కేసు ఉపసంహరించుకోండి.. లేదంటే ఈ ప్రాంతం నుంచి బహిష్కరించే పరిస్థితులు వస్తాయి. అంత వరకు తెచ్చుకోకండి.. అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. 

సీఎం రేవంత్ సీరియస్ కామెంట్స్:

  • మూసీ కాలుష్యంతో నల్గొండ ప్రజలు గోసలు పడుతున్నరు
  • భువనగిరి ఏరియాల్లో మూసీ పొల్యూషన్ తో జనం అల్లాడుతున్నరు
  • ఆ ప్రాంతంలో యువకులకు పెళ్లిల్లు కూడా కావడం లేదు
  • పిల్లలకు కూడా వైకల్యంతో పుడుతున్నరు
  • కొంత మంది స్వార్థంతో మూసీ ప్రక్షాళన అడ్డుకుంటున్నరు.
  • మేము చేయలేకపోయాం.. మీరు చేయొద్దనే అక్కసుతో అడ్డుకుంటున్నరు
  • ఒక అక్క కుమారుడు.. మూసీ ప్రక్షాళన ఆపాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ లో (NGT) పిటిషన్ వేశాడు
  • ఈ ప్రాంత ప్రజల అండగా 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న కుటుంబం
  • అన్ని పదవులు అనుభవించారు.. ఈ ప్రజలు ఇవ్వనిదంటూ లేదు ఆ అక్కకు
  • ఇవాళ ఆ అక్క కొడుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఈ పనిని ఆపమని కేసు వేసిండు
  • ఆ అక్క మనసు ఎట్ల ఒప్పుకున్నదో .. ఇలాంటి తప్పుడు కేసులను వేయించడానికి 
  • ఆ అక్కకి ఈ ప్రాంత ప్రజలు ఓట్లు వేయలేదా.. వాళ్ల కుటుంబాన్ని ఆశీర్వదించలేదా
  • ఈ రోజు ఈ రాష్ట్రంలో, దేశంలో ఆ అక్కకు, వాళ్ల కుటుంబానికి గుర్తింపు వచ్చింది 
  • ప్రజా ప్రతినిధులుగా, మంత్రులుగా పదవులు అనుభవించారంటే ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదం
  • ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను అడ్డుకోవడానికి నీ కన్న కొడుకే ఎన్జీటీలో కేసు వేస్తుంటే.. నీకు మనసెట్టా ఒప్పింది
  • ప్రజా ప్రతినిధిగా కొనసాగడానికి నీకు అర్హత ఉందా అని చెప్పి అడుగుతున్న
  • ఒకప్పుడు ఆ అక్క నాకు దగ్గర.. అప్పుడు ఇట్ల లేకుండే.. 
  • ఈ నాడు అట్ల తయారు కావటానికి కారణం ఏంటో నాకు తెలియదు
  • సావాస దోషం వల్ల మంచి వాళ్లతో ఉంటే మంచిగ ఉంటం.. 
  • చెడు స్నేహం చేస్తే చెడిపోతరని పెద్దలు చెప్తుంటరు
  • మంచోళ్లకు పది రూపాయలు ఇచ్చి దగ్గరికి తెచ్చుకోవాలి.. 
  • చెడ్డోళ్లను పది రూపాయలతో వదిలించుకోవాలి
  • ఈ చిన్న సూత్రం ఆ అక్కకు అర్థం కావటం లేదా అని అడుగుతున్న
  • ఈ ప్రాజెక్టును ఆపడానికి నీ పుత్రరత్నం వేసిన కేసును వెంటనే తక్షణమే ఉపసంహరించుకోండి
  • లేకపోతే ఈ ప్రజలు మీ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేసే పరిస్థితి వస్తుంది.. అంత దూరం రానియ్యొద్దు
  • వారి వెనకాల ముసుగు తొడుక్కొని దాక్కున్న వాళ్లకు కూడా చెప్తున్న
  • మీ వళ్ల కాని పనులు చాలా మేము చేస్తున్నం.. మీరు ఇట్లనే ఉంటే ఆ హోదా కూడా మిగలదు
  • ఇలాంటి చిల్లర మల్లర ప్రయత్నాలు ఆపేయాలని విజ్ఞప్తి చేస్తున్న
  • ఏది ఏమైనా.. ఆరు నూరైనా.. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిచినా ప్రాజెక్టు చేసి తీరుతాం
  • ఇది మా దీక్ష.. ఇది మా శివ దీక్ష.