ఐపీఎల్‌ లో ఫాస్టెస్ట్‌‌ బాల్‌ తో అన్రిచ్‌ రికార్డు

ఐపీఎల్‌ లో ఫాస్టెస్ట్‌‌ బాల్‌ తో అన్రిచ్‌ రికార్డు

156.2 కేఎంపీహెచ్‌ స్పీడ్ తో బాల్

దుబాయ్‌: ఢిల్లీ క్యాపిటల్స్‌ పేసర్‌ అన్రిచ్‌ నోకియా ఐపీఎల్‌‌లో అత్యం త ఫాస్టెస్ట్‌‌ డెలివరీ వేసి రికార్డు సృష్టించాడు. గంటకు 156.2 కిలోమీటర్ల వేగంతో బాల్‌‌ వేసి ఐపీఎల్‌‌ రికార్డులను తిరగరాశాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికాకే చెందిన తోటి పేసర్‌ డేల్‌‌ స్టెయిన్‌ (154.4 కేఎంపీహెచ్‌ ) ను వెనక్కి నెట్టాడు. బుధవారం రాజస్తాన్‌ తో జరిగిన మ్యాచ్‌ లో నోకియా ఈ ఫీట్‌ చేశాడు. రాయల్స్‌ ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ లో అన్రిచ్‌ వేసిన ఈ ఫాస్టెస్ట్‌‌ డెలివరీని ఫేస్‌‌ చేసిన జోస్‌‌ బట్లర్‌ .. స్కూప్‌ షాట్‌ తో బౌండ్రీ రాబట్టాడు. ‘ రికార్డు గురిం చి నాకు అప్పుడు తెలియదు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత తెలిసింది. పేస్‌‌ను మెరుగుపర్చుకునేందుకు చాలా కాలంగా శ్రమిస్తున్నా. ఆశించిన రిజల్ట్‌‌ రావడంతో ఆనందంగా ఉంది’ అని ఢిల్లీ క్యాపిటల్స్‌ రిలీజ్‌ చేసిన ఓ వీడియోలో అన్రిచ్‌ పేర్కొన్నాడు.