మేఘం వర్షించదా..

మేఘం వర్షించదా..

విజయ రామరాజు టైటిల్ రోల్‌‌‌‌లో నటిస్తున్న  స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో  శ్రీని గుబ్బల నిర్మిస్తున్నారు. ఆగస్టు 29న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా, గురువారం మొదటి పాటను విడుదల చేశారు. 

‘మేఘం వర్షించదా’ అంటూ  విఘ్నేష్  భాస్కరన్ కంపోజ్ చేసిన లవ్ సాంగ్‌‌‌‌కు దర్శకుడు  విక్రాంత్ రుద్ర రాసిన లిరిక్స్ ఇంప్రెస్ చేశాయి. కపిల్ కపిలన్, మీరా ప్రకాష్, సుజిత్ శ్రీధర్ కలిసి పాడిన తీరు ఆకట్టుకుంది. 

ఈ పాటలో విజయరామరాజు, సిజా రోజ్ కెమిస్ట్రీ లవ్లీగా ఉంది. ఈ చిత్రంలో హర్ష్ రోషన్, అజయ్, అజయ్ ఘోష్, దయానంద్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు.