ఈసీ కీలక నిర్ణయం.. తొలిసారిగా వారికిపోస్టల్ బ్యాలెట్ ఓట్లు

ఈసీ కీలక నిర్ణయం.. తొలిసారిగా వారికిపోస్టల్ బ్యాలెట్ ఓట్లు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసే అవకాశం తొలిసారిగా అంబులెన్స్ సిబ్బందికి కల్పించింది కేంద్ర ఎన్నికల సంఘం. గుర్తింపు పొందిన జర్నలిస్టులు కూడా పోస్టుల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయొచ్చని తెలిపింది. అత్యవసర సర్వీసు విభాగాలకు సంబంధించి లిస్ట్ ను విడుదల చేసింది ఈసీ.. ఫుడ్ సివిల్ సప్లై అండ్ కన్జూమర్ అఫైర్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆలిండియా రేడియో, దూర్ దర్శన్, పోస్ట్ అండ్ టెలిగ్రామ్, రైల్వే, బీఎస్ఎన్ఎల్, విద్యుత్, హెల్త్, ఫైర్ సర్వీస్, సివిల్ ఏవియేషన్ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసే అవకాశం కల్పించారు. ఇంతకుముందు ఎన్నికల కమిషన్ మీడియా వ్యక్తులు,80 ఏళ్లు పైబడిన వృద్ధులు,  వైకల్యం ఉన్నవారు (40 శాతం కంటే ఎక్కువ) ,  కోవిడ్ -19 రోగులు పోస్టల్ బ్యాలెట్లను ఉపయోగించి ఓటు వేయడానికి ఈసీ అనుమతించింది.

ఇదిలా ఉండగా, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నిర్ణయించిన తేదీ కంటే ముందు అన్ని నియోజకవర్గాల్లో పోస్టల్ ఓటింగ్ కేంద్రాలు (PVC) వరుసగా మూడు రోజుల వరకు తెరిచి ఉంటాయి. ప్రతి మూడు రోజులలో, PVC ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓటును వేయాలనుకునేవారు... ఎవరైనా గైర్హాజరైన ఓటరు ఫారం-12డిలో రిటర్నింగ్ అధికారికి అవసరమైన అన్ని వివరాలను తెలియజేస్తూ దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత సంస్థచే నియమించబడిన నోడల్ అధికారి ద్వారా దరఖాస్తును ధృవీకరించాలి. పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కోరుకునే అటువంటి దరఖాస్తులు ఎన్నికల ప్రకటన తేదీ నుండి సంబంధిత ఎన్నికల నోటిఫికేషన్ తేదీ నుండి ఐదు రోజుల మధ్య వ్యవధిలో రిటర్నింగ్ అధికారికి చేరుకోవాలి. మరోవైపు  ఈ ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 10న యూపీలో తొలిదశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 

ఇవి కూడా చదవండి: 

కొవాగ్జిన్ టీకాపై పోస్టల్ స్టాంపు విడుదల 

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా