కొవాగ్జిన్ టీకాపై పోస్టల్ స్టాంపు విడుదల 

కొవాగ్జిన్ టీకాపై పోస్టల్ స్టాంపు విడుదల 

దేశంలో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమై ఏడాదైంది. ఈ సందర్భంగా కేంద్రం ప్రభుత్వం కరోనా నియంత్రణకు భారత్ బయోటెక్, భారత వైద్య పరిశోధన మండలి (ICMR) సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాపై కేంద్ర ప్రభుత్వం పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. భారత్ లో కరోనా నియంత్రణ కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యాక్సిన్ ఇప్పటికే 70శాతంమందికి అందింది. 

శాస్త్రవేత్తల కృషితో అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ తో కరోనా కట్టిడి అయ్యింది. ఇది దేశ ప్రజలకు వ్యాక్సిన్ ఊరటనిచ్చిందని చెప్పాల్సిందే. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన టీకా కోవాగ్జిన్ మంచి  ఫలితాలనిచ్చింది. ఈక్రమంలో దేశంలో కరోనా టీకా పంపిణీ ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదివారం (జనవరి 16,2022) కోవాగ్జిన్ టీకాపై పోస్టల్ స్టాంపును విడుదల చేశారు.

ప్రధాని మోడీ కలలుకన్న 'స్వావలంబన భారత్' సాధనలో కొవాగ్జిన్ టీకా తయారీ ఓ కీలక పరిణామం అని ఇది భారత్ సాధించిన ఘనత అని తెలిపారు మన్సుఖ్ మాండవీయ. ఇంత భారీ జనాభా కలిగిన భారత్ లో వ్యాక్సిన్ తో కరోనా ను కట్టడి చేయటం అనేది చాలా గొప్ప విషయం అని ఈ విషయంపై ప్రపంచ దేశాలు కూడా ఆశ్చర్యపోయాయని తెలిపారు. భారతదేశం 156 కోట్ల డోస్‌లు అందిజేసిన మైలురాయిని సాధించగలిగిందని మంత్రి తెలిపారు. దీనికి సంబంధించిన విషయాన్ని  ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.  ప్రభుత్వం, ప్రైవేటు రంగం సంయుక్తంగా కృషి చేయడం వల్లే కేవలం తొమ్మిది నెలల సమయంలోనే  దేశీయ కరోనా టీకా అందుబాటులోకి వచ్చిందని..ఇది చాలా గొప్ప విషయం అని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు.

 

మరిన్ని వార్తల కోసం..

రేపటి నుంచి వర్చువల్ గా కేసుల విచారణ