ఆధ్యాత్మికం: ఙ్ఞానోదయం.. గురించి బుద్దుడు చెప్పిన వివరణ ఇదే..!

ఆధ్యాత్మికం: ఙ్ఞానోదయం.. గురించి బుద్దుడు చెప్పిన వివరణ ఇదే..!

మేలుకొలుపు అనే పదానికి ఆధ్యాత్మిక డిక్షనరీలో జ్ఞానోదయం, బుద్ధుడు పొందిన స్థితి అనే అర్ధాలు ఉన్నాయి. ఇంగ్లీష్ డిక్షనరీలోచూసినప్పుడు. నిద్రలో నుంచి లేవడం అనే అర్థం ఉంది. అయితే, బుద్ధుడిని ఆధారంగా చేసుకొని మాట్లాడినప్పుడు 'మేలుకొలుపు' అనే పదం మరింత స్పష్టంగా అర్థమవుతుంది. మనషి తన లోపల ఉండే సంతోషాన్ని గుర్తించకుండా బతకడం అంటే అది కలలో అజ్ఞానంతో జీవిస్తున్నట్లే!

బయటి జ్ఞానం కాదు ..మనిషికి తల్లి ఆన్మనిస్తుంది. తర్వాత పెరిగి పెద్దయ్యాక ఎప్పుడు అతనిలో 'బుద్ధుడు' పుడతాడో అదే మేలుకొలుపు. మేలుకొలుపు అంటే బయటి విషయాల తాలూకు తెలివి. జ్ఞానం కాదు మనలోపల, మనసు లోతులో నిద్రపోయిన అద్భుత విషయాల తాలూకు జ్ఞానం! ఆ జ్ఞానం ఏంటో తెలుసుకోవడానికి బుద్దుడిగా మారడానికి కావాల్సిన శక్తి ప్రతి మనిషికి పుట్టకతోనే వస్తుంది. అది తెలుసుకున్న రోజు జీవిత ప్రయాణం మరింత సంతోషంగా సాగుతుంది. జీవితంలో మహోన్నత దశకు చేరుకుంటారు... కానీ, మనం జీవితాంతం ఎక్కడెక్కడికో పరుగులు తీస్తుంటాం. లెక్కలూ, లాజిక్​లతో కూడిన జీవితానికి మనమంతా బానిసలమైపోయాం.

దైవత్వం విశ్వం అంచుల్లోనే.. ఆకాశాలను తాకే గోపురాల్లోనో ఎక్కడో ఉండదు. అది మనలోనే ఉంటుంది. దాన్ని దర్శించే శక్తి కూడామనలోనే ఉంటుంది. కానీ, ఈ విషయం మనకు తెలియదంతే...! ఎప్పుడైతే బయటి విషయాల గురించి తీస్తున్నపరుగులు అవుతామో.. ఆ సమయంలోమాత్రమే మనలో ఉన్న మరో మనిషితోసమావేశమై తనివితీరా మాట్లాడగలం.. ఆసమయంలో ఆత్మ-శరీరం ఒక్కటవుతాయి.మననూ, మనం రెండూ ఒకే చోటకు చేరుతాయి. 

మేలుకొలుపు అనే విద్యుత్ ప్రవహించగానేయాక్టివేట్ అవుదామని సున్నితమైన 'సోయి'లేదా 'వివేకం' ఎప్పుడూ వెయిట్ చేస్తుంటుంది.మామూలుగానే అది చాలా సాధారణపరిస్థితుల్లో యాక్టివేట్ అవుతూ ఉంటుంది.అందమైన పువ్వు గాలిలో నాట్యం చేస్తున్నప్పుడుపొద్దున్నే అందంగా పాడుతున్న ఒక పక్షి
పాట విన్నప్పుడు అది యాక్టివేట్ అవుతుంది.అవి మనసు లోతుల్లో ఒక రకమైన కదలికనుతీసుకొస్తాయి.

ఆ మూమెంట్ లో పరమానందాన్ని రుచి. చూస్తాం అనుభవిస్తాం! కానీ, ఆక్షణాలు అలా అస్వాదిస్తామో లేదో.. కొన్ని క్షణాల్లో ఏదో ఒక శక్తి భౌతిక ప్రపంచంలోకి లాగేస్తుంది. ఒకవేళ ఇదేసంతోషం. అదే పరమానందం ఎప్పటికీ ఉంటే ఎలా ఉంటుంది? అదే మేలుకొలుపు! అప్పుడు ఆకాశం అనే మనసులో ఎలాంటి లెక్కల మబ్బులు. లాజిక్​ల ఉరుములు ఉండవు అదే ధ్యానం తాలూకు సంతోషం. అదే అసలు సిసలు జ్ఞానం. అది పొందినప్పుడు జీవితం పూర్తిగా మారిపోతుంది.

మనసుని మచ్చిక చేసుకుంటే.

జీవితం అంటేనే కష్టాలూ, బాధలు అనే మాటలు సాధారణంగా అందరి నోటా తరచుగా వినపడుతుంటాయి. ఎలాంటి కష్టాలు లేకుండా జీవితం సాగిపోవాలని, బాధలు లేకుండా బతకాలని కోరుకుంటుంటారు.. నిజమే ఎవరూ కష్టాల్లో కూరుకుపోవాలని కోరుకోరు. కానీ, ఆ కష్టాల నుంచి తప్పించుకోవాలంటే.. మనసుని మచ్చిక చేసుకోవాలి. 

అది కోరికల వెంట పరిగెడుతుంది. ప్లాన్ గీస్తుంది. ఫాలో  అవుతుంది. కావాల్సింది పొందుతుంది. తిరిగి మళ్లీ మొదటికి వస్తుంది. ఇలా జీవితాంతం చక్రంలా తిరుగుతూ ఉంటుంది. మనలో ఉండే సంతోషాన్ని వెతుకుదాం... మనలో ఉండే సంతృప్తిని రుచి చూద్దాం... అంటే దానికి మనను అసలు ఒప్పుకోదు. తనలో తాను తొంగి చూడటానికి వచ్చే ప్రతి అవకాశాన్ని పదేపదే అడ్డుకుంటుంది. 

ఈ ప్రక్రియలో మనలో లీనమైన ఒక అందమైన ఉనికిని మిస్ అయిపోతాం. అందుకే. నెమలి నాట్యాన్ని చూసినా, కోకిలపాట విన్నా, కలగాల్సిన సహజమైన అనుభూతిని మిస్ అయిపోతాం. పరమానందాన్ని అంతా మనలోనే...బుద్ధుడు మనలోనే ఉన్నాడు. దైవత్వం మనలోనే ఉంది. దాన్ని చూసే శక్తి కూడా మనలోనే ఉంది. కానీ, మనకు ఆ విషయం తెలియదు. 

దైవత్వం ఉందనే విషయాన్ని చూడగలినప్పుడు. భవిష్యత్తు గురించి ఆలోచనలు ఉండవు. ఈ క్షణంలో జీవించాలంటే... మనలోపల ఉన్న 'సోర్స్ ని గుర్తించాలంతే! ఇన్నర్​ ఎక్స్ పీరియన్స్, మనలోపల ఉండే బుద్ధి వల్లనే పరమాత్మని కలుసుకునే దారి సుగమమవుతుందని కబీర్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకోవాలి. భూమిలో పడ్డ విత్తనంటాగే... మన హృదయంలో కూడా ఒక కనపడని విత్తనం ఉంటుంది. మేలుకొలుపు అనే చినుకు తాకగానే.. ఆ విత్తనం మొలకెత్తి చిగురిస్తుంది.... వికసిస్తుంది.

అప్పుడే మనలో బుద్ధుడు పుడతాడు. బుద్ధుడు పుట్టాలంటే.. ముందుగా దానికి అవసరమైన శక్తిని సంపాదించడానికి ప్రయత్నించాలి.  ఆ  విత్తనానికి వేర్లు వచ్చేవరకు సాయం చేయాలి. అలా చేసే ప్రతి ప్రయత్నం జీవిత పరమార్థాన్ని లోలోపల దాగి ఉన్న అసలు నిజమే కనుగొనేలా చేస్తుంది. అదే మేలుకొలుపు!