మెగాస్టార్ చిరంజీవి , దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం “మన శంకర వరప్రసాద్ గారు” (MSVPG) . సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ కాసుల వర్షం కురిపించింది. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోయింది. టాలీవుడ్‌లో 'రీజనల్ ఇండస్ట్రీ హిట్'గా నిలిచి సరికొత్త రికార్డులను సృష్టించింది. మెగాస్టార్ కెరీర్ లోనే అత్యధిక వసూలు సాధించిన ఈ ఎంటర్టైనర్, ఇప్పుడు డిజిటల్ దునియాలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.
బాక్సాఫీస్ వద్ద రికార్డులు
ఈ సినిమా వసూళ్ల పరంగా అసాధారణమైన వేగాన్ని ప్రదర్శించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటి వరకు పంచవ్యాప్తంగా రూ.360 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. మెగాస్టార్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. పండగ సీజన్ అడ్వాంటేజ్‌ను పూర్తిస్థాయిలో వాడుకుంది. ఈ విజయంతో పవన్ కళ్యాణ్ 'OG' వంటి భారీ చిత్రాల లైఫ్ టైమ్ రికార్డులను సైతం అధిగమించి, నాన్-పాన్ ఇండియా విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది.
ALSO READ : 'గ్యాంగ్‌స్టర్' వార్.. బాక్సాఫీస్ బరిలో మరోసారి చిరు - బాలయ్య మాస్ క్లాష్!
అనిల్ రావిపూడి-మెగా మార్క్ మేజిక్!
బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి, మెగాస్టార్‌ను ఒక సరికొత్త అవతారంలో చూపించడంలో విజయవంతమయ్యారు. చిరంజీవి గారి అసలు పేరు 'శంకర వరప్రసాద్'ను టైటిల్‌గా పెట్టి, ఆయనలోని వింటేజ్ కామెడీ టైమింగ్‌ను, మాస్ స్వాగ్‌ను పక్కాగా వాడుకున్నారు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ చేసిన 'సాలిడ్ కామియో' సినిమాకు హైలైట్‌గా నిలిచింది. చిరు-వెంకీలను ఒకే ఫ్రేమ్‌లో చూడటం అభిమానులకు కనువిందుగా మారింది. భీమ్స్ సిసిరోలియో అందించిన మాస్ సాంగ్స్, నయనతార నటన ఈ సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చాయి. సుష్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మాణ విలువలు సినిమాను రిచ్‌గా మలచాయి.
ALSO READ : శరణ్ రాజ్ సెంథిల్ కుమార్ డైరెక్షన్లో కోమలీ కోలీవుడ్ ఎంట్రీ
OTT రిలీజ్ డేట్ ఫిక్స్!
థియేటర్లలో దాదాపు ఒక నెల రోజులకు పైగా విజయవంతంగా ప్రదర్శించబడిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ప్రియుల ముందుకు రానుంది. తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 (Zee5) ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు దక్కించుకుంది. ఫిబ్రవరి 11 నుంచి ఈ సినిమాను పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన సత్తాను మరోసారి బాక్సాఫీస్ వద్ద చాటిచెప్పిన ఈ చిత్రం, ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని చూసేందుకు ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిస్ అయిన వారు లేదా మళ్ళీ చూడాలనుకునే వారు ఫిబ్రవరి 11 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
