ప్రొడ్యూసర్‌‌‌‌ ఇన్వాల్వ్‌‌ అయితేనే బడ్జెట్‌‌ కంట్రోల్‌‌లో: రాజేష్ దండా

ప్రొడ్యూసర్‌‌‌‌ ఇన్వాల్వ్‌‌ అయితేనే బడ్జెట్‌‌ కంట్రోల్‌‌లో: రాజేష్ దండా

సామజవరగమన, ఊరు పేరు భైరవకోన, కే ర్యాంప్ లాంటి చిత్రాలతో నిర్మాతగా మెప్పించారు రాజేష్ దండా. గురువారం తన పుట్టినరోజు. ఈ సందర్భంగా కొత్త ప్రాజెక్ట్స్‌‌ గురించి ఆయన మాట్లాడుతూ ‘సంయుక్త లీడ్‌‌ రోడ్‌‌లో రూపొందిస్తున్న ‘బ్లాక్‌‌ గోల్డ్‌‌’ చిత్రం ఐదు రోజుల టాకీ బ్యాలెన్స్ ఉంది.   జూన్ లేదా జులైలో రిలీజ్‌‌కు ప్లాన్ చేస్తున్నాం. గన్ పట్టుకోని ఓ లేడీ పోలీస్ ఆఫీసర్, గన్ మాత్రమే వాడే విలన్ మధ్య జరిగే కథ ఇది.  సంయుక్త గారికి చాలా కొత్త పాత్ర అవుతుంది. ఇక అల్లరి నరేష్‌‌ హీరోగా నిర్మిస్తున్న చిత్రం వచ్చే నెల మొదటి వారానికి పూర్తవుతుంది. పూర్తిస్థాయిఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌. త్వరలోనే టైటిల్ అనౌన్స్ చేస్తాం. సమ్మర్‌‌లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. ఆది సాయికుమార్‌‌‌‌ హీరోగా ఈ నెల 27న ఓ సినిమాను స్టార్ట్‌ చేస్తున్నాం.

అల్లు శిరీష్‌‌ హీరోగా సుబ్బు డైరెక్షన్‌‌లో ఓ సినిమా ఉంటుంది. అలాగే అడివి శేష్‌తో ఓ సినిమా చర్చల దశలో ఉంది.  మరోవైపు ఈటీవీ విన్‌‌తో కలిసి ఓ కోర్ట్‌‌ రూమ్ డ్రామా చేయబోతున్నాం. రియల్‌‌ ఇన్సిడెంట్‌‌ ఆధారంగా కొత్త పాయింట్‌‌తో ఉంటుంది.  నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఇక  ‘సామజవరగమన’ సీక్వెల్ కోసం రైటర్స్‌‌ వర్క్ చేస్తున్నారు. వీటితో పాటు వచ్చే ఏడాది ఒక పెద్ద సినిమా ఉంటుంది. చర్చలు జరుగుతున్నాయి. ఓ డిస్ట్రిబ్యూటర్‌‌గా నాకున్న అనుభవం నిర్మాతగా స్క్రిప్ట్ సెలెక్షన్‌‌లో హెల్ప్ అవుతోంది.  మేనేజర్ల మీద ఆధారపడకుండా ప్రొడక్షన్‌‌లో ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటూ స్వయంగా ఇన్వాల్వ్ అయితేనే సినిమా బడ్జెట్లు  కంట్రోల్‌‌లో ఉంటాయి. నా వరకూ ఇదే చేస్తున్నాను’ అని చెప్పారు.