పలు తెలుగు చిత్రాలతో ఆకట్టుకున్న కోమలీ ప్రసాద్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో శరణ్ రాజ్ సెంథిల్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఫిమేల్ ఓరియెంటెడ్ సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘మండవెట్టి’. టస్కర్స్ డెన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శుక్రవారం పూజా కార్యక్రమాలతో ఈ మూవీ షూటింగ్‌ను స్టార్ట్ చేశారు.
ప్రస్తుతం తమిళనాడులోని మదురై జిల్లా ఉసిలంపట్టి ప్రాంతంలో షూటింగ్ జరుగుతోంది. క్రైమ్ థ్రిల్లర్ అంశాలతో పాటు మిస్టిసిజం, ఎమోషన్స్ కలయికగా మహిళ ప్రధానమైన కథతో సినిమా తెరకెక్కుతోంది. మనకు కావాల్సిన దాన్ని కోల్పోవటం కలిగే బాధ, గుర్తింపు, జీవన పోరాటం, వంటి అంశాలను మిళితం చేసి పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న కథతో దీన్ని రూపొందిస్తున్నామని మేకర్స్ చెప్పారు. తేనప్పన్, గజరాజ్, అమృత ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేయనున్నారు.
