కెన్ కరునాస్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన తమిళ చిత్రం ‘యూత్’. అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. తెలుగులో హౌస్‌ఫుల్ వినీత్, సందీప్ విడుదల చేస్తున్నారు. బుధవారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇంటర్మీడియట్ కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో హీరో గ్యాంగ్ చేసే అల్లరిని ఎంటర్‌టైనింగ్‌గా ప్రజెంట్ చేసిన తీరు ఆకట్టుకుంది.
ఒక్క అమ్మాయి ప్రేమించినా చాలు అనుకునే అతనికి ముగ్గురు అమ్మాయిలు ప్రపోజ్ చేయడంతో పట్టరాని ఆనందంలో ఉంటాడు. కానీ ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంటుంది. ఇంతకూ ముగ్గురిలో నిజమైన ప్రేమ ఎవరిది. కాలేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేయాలనుకునే యూత్, మిడిల్ క్లాస్ పేరెంట్స్ వాళ్లపై పెట్టుకున్న నమ్మకాల నేపథ్యంలో ఆసక్తికరంగా సాగింది ట్రైలర్. ఈ నెల 26న సినిమా విడుదల కానుంది.
